‘పుష్ప 2’లో వాటా కోరిన బన్నీ.. రజనీకాంత్‌ కంటే ఎక్కువే! | Sakshi
Sakshi News home page

‘పుష్ప-2’లో వాటా కోరిన బన్నీ.. రజనీ కంటే ఎక్కువ రెమ్యునరేషన్‌!

Published Sun, Nov 26 2023 1:49 PM

Allu Arjun Charge Huge Remuneration For Pushpa 2, Rumour Goes Viral - Sakshi

తెలుగు సినిమా మార్కెట్‌ రోజు రోజుకి పెరిగిపోతుంది. బాహుబలి తర్వాత వరుసగా ఇక్కడి నుంచి పాన్‌ ఇండియా సినిమాలు తెరకెక్కుతున్నాయి. వాటిలో చాలా వరకు విజయం సాధించాయి. కొన్ని చిత్రాలు అయితే.. సౌత్‌లో కంటే నార్త్‌లోనే ఎక్కువగా ఆడుతున్నాయి. అందుకే మన దర్శకనిర్మాతలు ఒక్కో సినిమాకి వందల కోట్లు ఖర్చు చేసేందుకు కూడా వెనుకడుగు వేయడం లేదు.

(చదవండి: 2023 లో చిన్న చిత్రాల హవా.. బడ్జెట్‌కు మించి ఎన్నో రేట్ల లాభాలు!)

అయితే సినిమా కలెక్షన్స్‌ పెరగడంతో..స్టార్‌ హీరోలు తమ రెమ్యునరేషన్స్‌ని కూడా పెంచేశారు. ఓ పాతికేళ్ల క్రితం స్టార్‌ హీరోకి రూ. కోటి ఇస్తే..అదే అతి పెద్ద పారితోషికం. కానీ ఇప్పుడు క్యారెక్టర్‌ ఆర్టిస్టులే రూ. కోటికి పైగా తీసుకుంటున్నారు. ఇక హీరోల రెమ్యునరేషన్‌ అయితే అమాంతం పెరిగిపోయింది. కొంతమంది స్టార్‌ హీరోలు ఒక్కో సినిమాకు రూ.100 కోట్లకు పైగా పారితోషికం పుచ్చుకుంటున్నారు. 

(చదవండి: స్టార్‌ కమెడియన్‌ మరణంతో అనాథగా మారిన ప్రియుడు.. చివరకు..)

సౌత్‌లో సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ అత్యధికంగా రూ. 200 కోట్లను రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్నట్లు గతంలో వార్తలు వినిపించాయి.  ఇక తాజాగా బన్నీ రెమ్యునరేషన్‌పై క్రేజీ రూమర్‌ ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది. పుష్ప-2 కోసం అల్లు అర్జున్‌.. రజనీకాంత్‌ కంటే ఎక్కువ రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నాడట.

వాటా కోరిన బన్ని
సుకుమార్‌-బన్నీ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్‌ మూవీ ‘పుష్ప’ ది రైజ్‌. 2021 చివరల్లో విడుదలైన ఈ చిత్రం ఇండియన్‌ బాక్సాపీస్‌ని షేక్‌ చేసింది. అంతేకాదు బన్నీకి జాతీయ అవార్డుని కూడా తెచ్చిపెట్టింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా పుష్ప-2 తెరకెక్కుతుంది. వచ్చే ఏడాదిలో విడుదలయ్యే ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

పు​ష్ప చిత్రానికి రూ. 50 కోట్ల రెమ్యునరేషన్‌ తీసుకున్న బన్నీ.. పార్ట్‌ 2కి  మాత్రం పారితోషికాన్ని ఒక ఫిగర్ లాగా కాకుండా వచ్చే రెవిన్యూలో పర్సెంటెజ్ లాగా తీసుకునేలా ఒప్పందం చేసుకున్నాడనే వార్త టాలీవుడ్‌లో వినిపిస్తుంది.  పుష్ప-2కి అయ్యే మొత్తం బిజినెస్‌లో 30 శాతం తనకు ఇచ్చేలా బన్నీ ఒప్పందం కుదుర్చుకున్నాడట. 

300 కోట్లకు పైనే..
పుష్ప : రి రైజ్‌ హిట్‌ కావడంతో దానికి సీక్వెల్‌గా వస్తున్న పుష్ప: ది రూల్‌పై భారీ హైప్‌ క్రియేట్‌ అయింది. సుకుమార్‌ కూడా ఛాలెంజ్‌గా తీసుకొని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు ఉన్న బజ్‌ బట్టి చూస్తే.. ఓవరాల్‌ బిజినెస్‌ రూ. 1000 కోట్లు అయ్యే చాన్స్‌ ఉందని సినీ పండితులు చెబుతున్నారు. ఒక వేళ ఇదే నిజమైతే.. ఇందులో బన్నీ వాటాగా దాదాపు రూ. 300 కోట్లు వెళ్తుంది. సౌత్‌ నుంచి ఇప్పటి వరకు ఏ హీరో కూడా ఈ స్థాయిలో రెమ్యునరేషన్‌ తీసుకోలేదు.  భారీ కలెక్షన్స్‌ వస్తాయనే ధీమాతో మైత్రీ మూవీ మేకర్స్‌ కూడా బన్నీ ఒప్పందానికి సై అన్నారేమో!

Advertisement
 
Advertisement
 
Advertisement