బాక్సాఫీస్‌ని షేక్‌ చేస్తున్న చిన్న చిత్రాలు | Sakshi
Sakshi News home page

2023 లో చిన్న చిత్రాల హవా.. బడ్జెట్‌కు మించి ఎన్నో రేట్ల లాభాలు!

Published Sun, Nov 26 2023 9:53 AM

Small Budget Movies Success Rate Increase In Tollywood - Sakshi

సినిమా విజయానికి కంటెంట్ ప్రధాన కారణం.దీనికి రుజువుగా నిలుస్తున్నాయి చిన్న సినిమాలు.కథ బలంతో వచ్చి..ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేస్తున్నాయి.తక్కువ బడ్జెట్లో నిర్మాణం జరుపుకుని లాభాల పంట పండిస్తున్నాయి. 2023 లో వచ్చిన స్మాల్ మూవీస్ ఇందుకు సాక్షంగా నిలిచాయి. ఒకటో రెండో కాదు..ఎన్నో సినిమాలు..విజయ ఢంకా మోగించాయి. ప్రేక్షకులను కనుల విందు చేసాయి. స్టార్స్ నటించకున్నా కూడా..మంచి కలెక్షన్లు రాబట్టి మేము కూడా ఫేమస్ అని నిరూపిస్తున్నాయి.

ఆ మధ్య తరుణ్ బాస్కర్ దర్శకత్వం వహించి, నటించిన కీడా కోలా మూవీ థియేటర్లోకి వచ్చింది. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంది. సినిమాకు సూపర్ హిట్ స్టెటస్ కూడా దక్కింది. మొదటి సినిమా పెళ్లి చూపులుతోనే...తెలుగు బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ తో పాటు..ఉత్తమ స్క్రీన్ ప్లే, డైలాగ్ రైటర్‌గా జాతీయ అవార్డు అందుకున్నాడు తరుణ్. తర్వాత ఈ నగరానికి ఏమైంది మూవీతో యూత్‌ను అట్రాక్ట్ చేసాడు. రీసెంట్‌గా రీ రిలీజ్ అయిన ఈ మూవీ.. మంచి వసూళ్లు రాబట్టడం విశేషం. ఇక తర్వాత వెంకటేశ్‌తో తరుణ్ మూవీ పట్టాలు ఎక్కాల్సింది. కాని ఈ మూవీ ప్రారంభం అవటం ఆలస్యం అవుతుండటంతో..ఈ లోపు కీడా కోలా మూవీకి మెగా ఫోన్ పట్టుకున్నాడు.

మా ఊరి పొలిమేర మూవీ ఓటీటీలో విడుదలయింది.మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.ఆడియన్స్ ఈ థ్రిల్లర్ సబ్జెక్టు బ్రహ్మరథం పట్టారు.ఇటీవల మా ఊరి పొలిమేర మూవీకి సెకండ్ భాగం కూడా విడుదల అయింది.అయితే ఈ సారి థియేటర్లలోకి వచ్చింది.ఫస్ట్ భాగానికి వచ్చిన స్పందనతో...రెండో భాగానికి మంచి వసూళ్లు వచ్చాయి.సత్యం రాజేష్,బాలాదిత్యా లాంటి వారు ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది.

(చదవండి: వాస్తవ సంఘటనలే సినిమాగా తెరకెక్కిస్తున్న దర్శకులు)

ఈ ఇయర్ హిట్ సినిమాల గురించి మాట్లాడుకుంటే..మ్యాడ్ మూవీ గురించి కూడా చెప్పుకోవాలి.అంతగా గుర్తింపు లేని యాక్టర్లు నటించిన ఈ కామెడీ డ్రామా..యూత్ ఆడియన్స్‌ను  బాగా ఆకట్టుకుంది. కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన ఈ మూవీ..మంచి వసూళ్లు రాబట్టింది.

(చదవండి: ప్రభాస్‌ 'సలార్‌' షర్ట్‌ కావాలంటే ఇలా పొందండి.. ధర ఎంతో తెలుసా?)

మీడియం రేంజ్ హీరోలకే వందకోట్ల కలెక్షన్లు డ్రీమ్‌గా మారాయి. రేపో మాపో ఈ టార్గెట్ చేరుకోవాలి అనుకుంటున్నారు. అయితే బేబి లాంటి చిన్న సినిమా మాత్రం ..దాదాపుగా వందకోట్ల వసూళ్లుకు దగ్గరగా వెళ్లింది. ఆనంద్ దేవరకొండ కు ..బిగ్ హిట్ లేదు. ఈ మూవీ దర్శకుడు సాయి రాజేశ్‌కు కూడా..ఓ కమర్శియల్ విజయం లేదు. కాని..కంటెంట్ యూత్ కు బాగా కనెక్ట్ అయింది. అందుకే భారీ విజయం సాధ్యం అయింది

శ్రీవిష్ణుకి విజయం వచ్చి చాలా కాలామే అయింది. అయితే ఈ ఇయర్ మాత్రం..ఉహించని సక్సెస్ చూశాడు. సామజవరగమనతో..సూపర్ హిట్ అందుకున్నాడు.డిఫరెంట్ సబ్జెక్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా యాభై కోట్ల వసూళ్లు రాబట్టింది. కామెడీ డ్రామాగా రూపొందిన ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు

మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఆడియనన్స్‌ను ఫ్రెష్ ఫీల్ కలుగజేసింది.సెంటిమెంట్,ప్రేమ,మెసెజ్ లాంటి అన్ని అంశాలతో కట్టి పడేసింది. ఈ సినిమాలో సంభాషణలు ఆసక్తికరంగా ఉండి ఆకట్టుకున్నాయి. మినిమిం బజ్‌తో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర యాభై కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

తెలంగాణ నేపథ్యంలోని పల్లెటూరి లో జరిగే స్టోరీతో తెరకెక్కింది బలగం. ఈ మూవీ మీద ఏమాత్రం అంచానాలు లేవు. కాని కంటెంట్ పర్ఫెక్ట్‌గా ఉంటే ..చిన్న సినిమా కూడా మంచి వసూళ్లు రాబడుతుంది అని చెప్పటానికి పెద్ద ఉదాహారణగా ఈ మూవీ నిలిచింది. చావు చుట్టు తిరిగే ఈ మూవీ స్టోరీ. బందాలు,అనుభందాలు ఎంత గొప్పగా ఉంటాయో చాటి చెప్పింది.

ఆర్ ఎక్స్ 100 తర్వాత కార్తికేయకు మరో విజయం దక్కలేదు.మార్కెట్ కూడా పాడు చేసుకున్నాడు.దాంతో విజయం కంపల్ సరిగా మారింది.ఈ సారి బెదురు లంక 2012 మూవీతో వచ్చాడు.ఈ ఇయర్ థియేటర్లలోకి వచ్చింది.పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని..డీసెంట్ హిట్ కొట్టింది.కార్తికేయను హిట్ ట్రాక్ మీదికి తీసుకొచ్చింది.నేహా శెట్టి ఈ మూవీలో కథానాయికగా నటించింది.

ఇక ఈ నెలలో విడుదలైన మంగళవారం, కోట బొమ్మాళి చిత్రాలు కూడా హిట్‌ టాక్‌ని సంపాదించుకున్నాయి. అయితే ఇందులో మంగళవారం చిత్రానికి పాజిటివ్‌ టాక్‌ వచ్చిన.. ఆశించిన స్థాయిలో మాత్రం వసూళ్లను రాబట్టలేకపోతుంది. ఇక కోట బొమ్మాళి మూవీ కలెక్షన్స్‌ ఎలా ఉంటాయో చూడాలి. 

ఈ ఏడాది వీటితో పాటు మరికొన్ని చిన్న చిత్రాలు కూడా ఆడియన్స్‌ని ఆకట్టుకున్నాయి. తెలంగాణ నేపథ్యంలో పల్లెటూరులో జరిగే సబ్జెక్ట్‌తో రూపొందిన పరేషాన్, డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన మిస్టర్‌ ఫ్రెంగ్నెంట్‌.. సుహాన్‌ హీరోగా నటించిన రైటర్‌ పద్మభూషణ్‌ లాంటి చిత్రాలు కూడా డీసెంట్‌ హిట్‌ టాక్‌ని సంపాదించుకున్నాయి. 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement