
టాలీవుడ్ హీరో అల్లరి నరేశ్ నటించిన కొత్త సినిమా ఆల్కహాల్ టీజర్ విడుదలైంది. ఇందులో రుహానీ శర్మ హీరోయిన్గా నటిస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. దర్శకుడు మెహర్ తేజ్ మంచి కామెడీ టైమింగ్ పంచ్‌లతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన టీజర్లో నరేశ్, సత్యల మధ్య వచ్చిన కామెడీ పంచ్లు ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీలో నిహారిక ఎన్‌ఎమ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ ప్రకటించారు.