
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం 'కింగ్‌డమ్'.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా నిర్మించారు. జులై 31న పాన్ ఇండియా రేంజ్‌లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. అనిరుధ్ సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. ఈ సినిమా విడుదల సందర్భంగా నిర్మాత నాగవంశీ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలో 'బుక్‌మైషో'లో కనిపించే రేటింగ్స్, లైక్స్‌తో పాటు రివ్యూలు అన్నీ ఫేక్ అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అదంతా డబ్బులిచ్చే తామే చేపిస్తామని ఆయన చెప్పుకొచ్చారు.
కొత్తగా విడుదలయ్యే సినిమాకు ఒక నిర్మాత ఏలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో నాగవంశీ ఓపెన్‌గా చెప్పారు.'మీడియాతో సరైనా సత్సంబంధాలు లేకుంటే ఒక సినిమా కిల్ అయిపోతుందనే భయం ప్రతి నిర్మాతలో ఉంటుంది. గత 15ఏళ్లుగా మేమే దానిని అలా క్రియేట్ చేసుకున్నామనిపిస్తుంది. ఇలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసే వారిలో కొందరు పీఆర్ (పబ్లిక్ రిలేషన్స్) టీమ్‌తో పాటు డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఉన్నారు. సినిమా విడుదలకు ముందు డబ్బులు ఖర్చు చేయకుంటే నష్టపోతామని మమ్మల్ని ఏకంగా పీఆర్ టీమ్ వారు బెదిరిస్తున్నారు. మూవీ విడుదల తర్వాత రేటింగ్, లైకులు, మంచి రివ్యూల కోసం ఏకంగా రూ. 30 లక్షలకు పైగా ఖర్చు చేయాల్సి వస్తుంది. కోట్లు ఖర్చు పెట్టి భయంతో ఉన్న మాకు రూ. 30 లక్షలే కదా అని ఒప్పుకోవాల్సిన పరిస్థితిలో మేము ఉన్నాం.
తాజాగా కింగ్‌డమ్ ప్రోమో విడుదలైంది. ప్రేక్షకుల నచ్చింది. ప్రైమ్ మీడియాతో పాటు అందరూ బాగా రాశారు. అయితే, ఆ ప్రోమె కంటెంట్ నిజంగానే బాగుందని రాశారా..? లేదా పీఆర్ టీమ్ వారు టాలెంట్ చూపించి రాపించారా..? అనేది ఎవరికీ తెలియదు. కానీ, పీఆర్ టీమ్ మాత్రం తమ వల్లే వారందరూ మంచిగా రాశారని దర్శకుడు, ప్రోడ్యూసర్స్ దగ్గరికి వచ్చి గొప్పలు చెప్పుకుంటారు. అలా గొప్పగా మనమే రాపించామండి.. మనం చెప్పకపోతే వారు అసలు అలా రాయరని చెబుతారు. ఇలాంటి పరిస్థితి ప్రితి నిర్మాతకు ఎదురౌతుంది. 'బుక్‌మైషో'లో మీకు కనిపించే రేటింగ్స్, లైక్స్ కూడా మేము డబ్బులు ఇచ్చే చేపిస్తున్నాం. బుక్‌మైషోలో ఒక సినిమాకు ఎక్కువ లైకులు ఉంటే మరో సినిమా నిర్మాత ఇలా డబ్బులు ఇచ్చి చేపించడమే.. ఓపెన్‌గా చెబుతున్నాను ఇదే నిజం. ఇలాంటి తప్పుడు ప్రమోషన్ చేయకూడదని గిల్డ్‌లో మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. బుక్‌మైషో వాడికి సినిమా టికెట్ ద్వారా వచ్చే కమీషన్‌తో పాటు ఇలా అదనంగా డబ్బు కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఇక నుంచి ఇలాంటి పని ఎవరూ చేయకూడదని నిర్ణయం తీసుకున్నాం.' అని ఆయన అన్నారు.
@vamsi84 intha open ga PRO la gurinchi cheppinodu evad ledu industry lo🔥🔥 nuvu thaggaku
Absolutely 💯 correct ayana cheppindhi 🥵🥵🥵#Kingdom
Credits @greatandhranews pic.twitter.com/IO7HH9qyf5— 𝙏𝙝𝙚𝙢𝙨𝙠😉 (@saikiranM8721) July 20, 2025