నా భార్య రెండు ఇండక్షన్‌ స్టవ్స్‌ ఆర్డర్‌ చేసింది: హీరో | Akshay Kumar Says Twinkle Khanna Prepares Backup And Orders 2 Induction Stoves Amid LPG Shortage In India | Sakshi
Sakshi News home page

Akshay Kumar: ఇండక్షన్‌ స్టవ్స్‌ ఆర్డర్‌ పెట్టింది.. మీరు కూడా కొనుక్కోండి!

Mar 18 2026 8:27 AM | Updated on Mar 18 2026 10:06 AM

Akshay Kumar: Twinkle Khanna Orders 2 Induction Stoves

పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా భారత్‌లో ఎల్పీజీ గ్యాస్‌ సరఫరాలో జాప్యం జరుగుతోంది. దీంతో ఇప్పటికే అనేక హోటళ్లు ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యి, కరెంట్‌ స్టవ్‌లమీద వంట చేస్తున్నాయి. అటు ప్రజలు సైతం సిలిండర్లు సమయానికి రావకపోవడంతో ఇండక్షన్‌ స్టవ్‌లు ఎగబడి మరీ కొంటున్నారు. 

రెండు ఆర్డర్‌..
బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ కూడా అదే పని చేశాడు. ఓ కార్యక్రమంలో అక్షయ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. నా భార్య (ట్వింకిల్‌ ఖన్నా) నిన్నగాక మొన్న రెండు ఇండక్షన్‌ స్టవ్స్‌ ఆర్డర్‌ పెట్టింది. అదింకా డెలివరీ అయిందో, లేదో నాకు తెలీదు. ఎందుకైనా మంచిది, మీరు కూడా ఒకటి కొనుక్కుంటే బెటర్‌ అన్నాడు. 

సినిమా
ప్రస్తుతానికి తమ ఇంట్లో వంటగ్యాస్‌ కొరత లేదని, కాకపోతే బ్యాకప్‌ కోసం ఇండక్షన్‌ స్టవ్‌ రెడీ చేసుకుంటున్నట్లు తెలిపాడు. అక్షయ్‌ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం అతడు ప్రధాన పాత్రలో నటించిన హారర్‌ కామెడీ చిత్రం భూత్‌ బంగ్లా ఏప్రిల్‌ 10న రిలీజ్‌ కానుంది. ఇది కాకుండా ఆయన చేతిలో మరో నాలుగు సినిమాలున్నాయి.

చదవండి: చికిరి చికిరి పట్టించుకోలేదు.. ఈ పాట వల్లే అభాసుపాలు: గేయరచయిత

Advertisement
 
Advertisement
Advertisement