రూ.4500 జీతానికి పని చేస్తున్న స్టార్‌ హీరో కొడుకు | Akshay Kumar Reveals Son Aarav Work For RS 4500 | Sakshi
Sakshi News home page

రూ.4500 జీతానికి పని చేస్తున్న స్టార్‌ హీరో కొడుకు

Apr 19 2026 3:03 PM | Updated on Apr 19 2026 3:42 PM

Akshay Kumar Reveals Son Aarav Work For RS 4500

ఆ యువకుడి తండ్రి ఓ స్టార్‌ హీరో. కోట్ల ఆస్తి ఉంది. సినిమాల్లోకి వస్తానంటే.. దర్శకనిర్మాతలు ఆయన ఇంటి ముందు క్యూ కడతారు. కానీ ఇవన్నీ వదులుకోని ఓ సాధారణ యువకుడిలా జీవితం గడుపుతున్నాడు. ఆయన ఎవరో కాదు బాలీవుడ్‌ స్టార్‌ హీరో కొడుకు అరవ్‌ భాటియా. 

24 ఏళ్ల వయసు ఉన్న ఈ యువకుడు.. అనుకుంటే ఈ పాటికే హీరో అయిపోయేవాడు. కానీ నటన అంటే ఆయనకు ఇష్టం లేదు. ఫ్యాషన్‌ రంగంలో రాణించాలనేది ఆయన కల. అందుకే ప్రస్తుతం ఆ ఫీల్డ్‌లో రూ. 4500 జీతానికి పని చేస్తున్నాడట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో అక్షయ్‌ కుమార్‌ వెల్లడించారు.

‘అరవ్‌కి పని చేయడం ఇష్టం. సినిమా రంగంలోకి రావాలనుకోవట్లేదు. ప్రస్తుతానికి అతనికి ఎలాంటి ప్లాన్స్‌ లేవు కానీ ఫ్యాషన్‌ రంగంలోకి వెళ్లాలనుకుంటున్నాడు. ఇప్పటికే ఆ ఫీల్డ్‌లో రూ. 4500 జీతానికి పని చేస్తున్నాడు. గ్రామాలు తిరుగుతూ ఫ్యాషన్‌పై అధ్యయనం చేస్తున్నాడు. హీరో కొడుకునని ఎక్కడ చెప్పుకోడు. నేను కూడా వాడిని సినిమాల్లోకి రావాలని ఫోర్స్‌ చేయను. తనకు నచ్చిన పని చేసుకోమని చెబుతాను. తండ్రిగా వాడికి ఎలాంటి క్లాసులు తీసుకోని కానీ.. ‘ఎవరికీ హానీ చేయొద్దు.. బాధ పెట్టొద్దు’ అని మాత్రం చెబుతాను’ అని అక్షయ్‌ చెప్పుకొచ్చాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement