కుమారుడి పెళ్లి ఫోటోలు షేర్‌ చేసిన నాగార్జున | Akkineni Nagarjuna Shares Marriage Photos of His Son Akhil Akkineni and Zainab Ravdjee | Sakshi
Sakshi News home page

కుమారుడి పెళ్లి ఫోటోలు షేర్‌ చేసిన నాగార్జున

Jun 6 2025 8:02 PM | Updated on Jun 7 2025 9:06 AM

Akkineni Nagarjuna Sher Akhil Wedding Photos

టాలీవుడ్‌ నటుడు అఖిల్‌ అక్కినేని (Akhil Akkineni) శుక్రవారం తెల్లవారుజామున వివాహబంధంలోకి అడుగుపెట్టారు. తన ప్రియురాలు జైనబ్‌ రవ్జీతో కలిసి ఏడడుగులు వేశారు. ఇదే విషయాన్ని చెబుతూ తాజాగా నాగార్జున ఒక పోస్ట్‌ షేర్‌ చేశారు. అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన ఈ వేడుకలో చిరంజీవి, రాజమౌళి తనయుడు కార్తికేయ, దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌తో పాటు  పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.  అన్నపూర్ణ స్టూడియోస్‌లో జూన్‌ 8న రిసెప్షన్‌ జరగనుంది. ఆ సమయంలో సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.

అఖిల్‌ వివాహ వేడుక ఫొటోలను అభిమానులతో నాగార్జున పంచుకున్నారు. తన ఆనందాన్ని ఇలా చెప్పుకొచ్చారు. 'మా ప్రియమైన కుమారుడు తనకు ఇష్టమైన జైనాబ్‌ను  మా ఇంట్లో (తెల్లవారుజామున 3:35 గంటలకు) వివాహం చేసుకున్నాడు.  అమలతో పాటు నేను ఎంతో ఆనందంగా ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. ఈ ప్రదేశం మా హృదయాలకు ఎంతో దగ్గరైంది. ఇక్కడ వారు కలిసి  కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. మేము మీ ఆశీర్వాదాలను కోరుకుంటున్నాము. ప్రేమ, కృతజ్ఞతతో అంటూ..'  నాగార్జున పోస్ట్‌ చేశారు.

అఖిల్‌ సతీమణి జైనబ్ రవ్జీ హైదరాబాద్‌కు చెందిన అమ్మాయినే.. అయితే, ముంబయిలో స్థిరపడింది. ఆమె తండ్రి జుల్ఫీ రవ్జీ ప్రముఖ వ్యాపారవేత్త.  రెండేళ్ల క్రితం ఒక ఫంక్షన్‌లో అఖిల్‌-జైనబ్‌ కలుసుకున్నారని తెలుస్తోంది. అలా వీళ్లిద్దరి మధ్య చిగురించిన స్నేహం క్రమంగా ప్రేమగా మారింది.
 

Advertisement
 
Advertisement
Advertisement