
టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన కల్ట్ మూవీ నిన్నే పెళ్లాడతా. ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్గా నిలిచింది. 1996లో వచ్చిన ఈ చిత్రానికి కృష్ణవంశీ దర్శకత్వం వహించగా.. అక్కినేని నాగార్జునే నిర్మాతగా వ్యవహరించారు. ఈ మూవీ రిలీజై అక్టోబర్ 4వ తేదీ నాటికి 29 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో నాగార్జున సరసన టబు హీరోయిన్గా మెప్పించింది. ఈ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీకి అభిమానులు ఫిదా అయిపోయారు.
ఈ చిత్రం విడుదలైన 29 ఏళ్లు పూర్తి కావడంతో ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సినిమాలోని పాటలు పాడుతూ ఎంజాయ్ చేశారు. ఏటో వెళ్లిపోయింది మనసు.. ఎలా ఒంటరైంది మనసు.. ఓ చల్లగాలి..ఆచూకి తీసి.. కబురివ్వలేవా ఏమైయిందో.. అంటూ సాగే పాట పాడుతూ చిల్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను నాగ్ అభిమాని ట్విటర్లో షేర్ చేశారు. అభిమానుల శక్తి అద్భుతం.. ఫ్యాన్స్ కలిసి వచ్చినప్పుడు నిజంగా ఒక ప్రత్యేక అనుభవం అంటూ పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
The power of fandom is incredible, and when fans come together, it's truly a special experience! 👏
Cult King Fan's at one frame 😍
.@iamnagarjuna ❤️ 😍 💖
#29YearsForNinnePelladutha ❤️#KingNagarjunaForver ❤️ 😍 💖 #King100 🔥 🔥 pic.twitter.com/M22sNnl0kZ— NagaKiran Akkineni (@NagaKiran60) October 7, 2025