Actress Yashika Anand Dancing For Pushpa Saami Saami Song, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Yashika Anand: పుష్ప పాట‌కు చిందేసిన య‌షిక‌.. నువ్వింకా బ‌తికే ఉన్నావా? నెటిజ‌న్ ప్ర‌శ్న‌

Jan 19 2022 11:37 AM | Updated on Jan 19 2022 12:53 PM

Actress Yashika Aannand Dancing For Pushpa Saami Saami Song, Video Goes Viral - Sakshi

అభిమానులు యషికా పూర్తి ఆరోగ్యంగా క‌నిపించ‌డంపై సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ఓ నెటిజ‌న్ మాత్రం 'నువ్వింకా బ‌తికే ఉన్నావా?' అని ప్ర‌శ్నించాడు.

రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ 'నోటా' సినిమాతో తెలుగు, త‌మిళ ఇండ‌స్ట్రీకి హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయింది య‌షికా ఆనంద్‌. ఆ త‌ర్వాత స్పెష‌ల్ సాంగ్స్‌లో ఎక్కువ‌గా క‌నిపించిన ఆమె ప్ర‌స్తుతం నాలుగైదు సినిమాలు చేస్తోంది. అయితే గ‌తేడాది య‌షికా రోడ్డు ప్ర‌మాదానికి గుర‌వ‌గా కొద్దికాలంపాటు మంచానికే ప‌రిమిత‌మైంది. త‌ర్వాత నెమ్మ‌దిగా తిరిగి న‌డ‌వడం మొద‌లు పెట్టిన ఆమె చాలాకాలానికి డ్యాన్స్ వీడియోను షేర్ చేయ‌గా ప్ర‌స్తుతం అది వైర‌ల్‌గా మారింది..

పాన్ ఇండియా సినిమా పుష్ప‌లోని సామీ.. నా సామీ.. పాట‌కు త‌న‌దైన స్టైల్‌లో స్టెప్పులేసింది. ఈ వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఏదో అలా ట్రై చేశాను. కానీ నేను సాధార‌ణంగా నేనెలా డ్యాన్స్ చేస్తానో అలాగైతే చేయ‌లేదు. ఇక్క‌డికి రావ‌డానికే ఆరు నెల‌లు ప‌ట్టింది. కాబ‌ట్టి త్వ‌ర‌లోనే మ‌ళ్లీ డ్యాన్స్ చేస్తాను, కాక‌పోతే ఈ ప్ర‌దేశంలో మాత్రం కాదు అని రాసుకొచ్చింది.

ఇక ఈ వీడియో చూసిన అభిమానులు యషికా పూర్తి ఆరోగ్యంగా క‌నిపించ‌డంపై సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. 'య‌షికా పూర్తిగా కోలుకుందోచ్', 'ఊ అంటావా మావా.. ఉఊ అంటావా మావా పాట‌కు కూడా డ్యాన్స్ చేయండి' అని కోరుతూ కామెంట్లు చేస్తున్నారు. ఓ నెటిజ‌న్ మాత్రం 'నువ్వింకా బ‌తికే ఉన్నావా?' అని ప్ర‌శ్నించాడు. దీనికి ఓ అభిమాని స్పందిస్తూ.. 'యాక్సిడెంట్‌లో య‌షికా ఫ్రెండ్ చ‌నిపోయారు, ఆమె ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డింది' అని బ‌దులిచ్చాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement