హీరోయిన్‌గా తెలుగులో ఒక్కటే సినిమా.. ఈ బ్యూటీని గుర్తుపట్టారా? | Actress Riya Sen Movies And Details In Telugu | Sakshi
Sakshi News home page

Guess The Actress: వయసు 42 ఏళ్లు.. ఏడు భాషల్లో హీరోయిన్‌గా సినిమాలు!

Nov 30 2023 9:26 PM | Updated on Dec 1 2023 9:23 AM

Actress Riya Sen Movies And Details In Telugu - Sakshi

హీరోయిన్లకు వయసు పెరిగితే గ్లామర్ తగ్గిపోతుందని అంటారు. అదేంటో గానీ ఈ బ్యూటీ 40 ఏళ్లు క్రాస్ చేసినా సరే ఇప్పటికీ అందంగానే కనబడుతోంది. కుర్ర హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా కనిపిస్తుంది. తెలుగుతో కలిసి మొత్తంగా ఏడు భాషల్లో సినిమాలు చేసింది. అలానే ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గానే ఉండిపోయింది. మరి ఈమె ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?

పైన ఫొటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మ పేరు రియాసేన్. స్వతహాగా బెంగాలీ అయినా ఈమె.. అమ్మ, అమ్మమ్మ కూడా హీరోయిన్లే. అంతెందుకు ఈమె అక్క కూడా హీరోయినే. తెలుగులో 'ధైర్యం'లో చేసిన రైమా సేన్ ఈమెకు సొంత అక్క. వీళ్లందరి వారసత్వాన్ని కొనసాగిస్తూ రియా సేన్.. ఐదేళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చేసింది. 10 ఏళ్ల వయసు నుంచి పూర్తి స్థాయి నటిగా మారిపోయింది.

(ఇదీ చదవండి: చెప్పిన టైమ్ కంటే ముందే ఓటీటీలోకి వచ్చేసిన చైతూ ఫస్ట్ వెబ్ సిరీస్)

18 ఏళ్ల టీనేజ్ వయసులో ఉండగానే 'తాజ్‌మహల్' అనే తమిళ సినిమాతో హీరోయిన్‌ అయ్యింది. అనంతరం బెంగాలీ, హిందీ, మలయాళ, ఇంగ్లీష్, ఒడియా భాషల్లో హీరోయిన్‌గా పలు చిత్రాలు చేసింది. 2008లో రిలీజైన 'నేను మీకు తెలుసా?' అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది ఈ బ్యూటీనే. కాకపోతే ఇది ఫ్లాప్ అయ్యేసరికి తెలుగులో మరో ఛాన్స్ రాలేదు. దీంతో మిగతా భాషలకే పరిమితమైపోయింది.

గత రెండు మూడేళ్ల నుంచి ఈమెకు అటు సినిమాల్లో గానీ ఇటు వెబ్ సిరీస్‌ల్లో గానీ ఛాన్సులు రావడం లేదు. దీంతో ఇన్ స్టాలో గ్లామరస్ ఫొటోలు పోస్ట్ చేస్తూ ఎంటర్‌టైన్ చేస్తోంది. ఈమె వయసు ఇప్పుడు 42 ఏళ్లు. అయినా సరే అస్సలు అలా కనిపించదు. అక్క రైమా‌సేన్‌లానే ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండానే ఉండిపోయింది. సో అదన్నమాట విషయం.

(ఇదీ చదవండి: తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేయని ప్రభాస్.. కారణం అదేనా?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement