
సినీ నటి రంగ సుధపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు వైరల్ కావడంతో ఆమె పంజగుట్ట పోలీసులను ఆశ్రయించారు. రాధాకృష్ణ అనే వ్యక్తి తనపై అసభ్యకర పోస్టులు చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. తాము కలసి ఉన్న సమయంలో తీసిన కొన్ని ప్రైవేట్ వీడియోలు, ఫొటోలు బయట పెడతానని గతంలోనే రాధాకృష్ణ తనను బెదిరించాడని ఆమె ఫిర్యాదులో తెలిపారు. ప్రస్తుతం కొన్ని ట్విటర్ పేజీలతో పాటు రాధకృష్ణ కూడా అసభ్యకర పోస్టులు చేస్తున్నాడని నటి ఫిర్యాదులో ప్రస్తావించారు.
దీంతో పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు షేర్ చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. గతంలో రాధకృష్ణతో రంగ సుధ రిలేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇద్దర మధ్య విబేధాలు రావడంతో గతకొంత కాలంగా రంగ సుధ.. రాధకృష్ణకు దూరంగా ఉంటుంది. ఈ కోపంతోనే ఆయన సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిస్తున్నట్లు తెలుస్తోంది.
మోడల్ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన రంగ సుధ.. చిన్న చిన్న పాత్రలు చేస్తూ.. మలయాళంలో హీరోయిన్ గా మారింది. తేరి మేరీ అనే మలయాళ సినిమాలో ఆమె సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఈమెకు సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ బేస్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 9 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.