Actress Rambha Meet Car Accident While Back From School With Her Children - Sakshi
Sakshi News home page

Rambha Car Accident: హీరోయిన్‌ రంభ కారుకు ప్రమాదం, ధ్వంసమైన కారు.. ఫొటోలు వైరల్‌

Nov 1 2022 9:53 AM | Updated on Nov 1 2022 10:45 AM

Actress Rambha Meet Car Accident While Back From School With Her Children - Sakshi

సీనియర్ హీరోయిన్, నటి రంభకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారు మంగళవారం ప్రమాదానికి గురి అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా రంభ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. దీంతో ఆమె ఫ్యాన్స్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో పెద్దగా ఎవరికి గాయలు కాలేదని, ఆమె కూతురు సాషాకు చిన్నపాటి గాయలకారణంగా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు ఆమె తెలిపింది. ఈ మేరకు రంభ ట్వీట్‌ చేస్తూ.. ప్రమాదానికి గురైన కారు ఫొటోలు, ఆస్పత్రిలో చేరిన చిన్నారి ఫొటోలను పంచుకుంది. 

చదవండి: సమంత అనారోగ్యంపై స్పందించిన మరో అక్కినేని హీరో, ‘వెంకి మామ’ కూతురు

‘పిల్లలను స్కూల్ నుంచి తీసుకు వస్తుండగా... ఇంటర్ సెక్షన్ దగ్గర మా కారును మరో కారు ఢీ కొట్టింది. అప్పుడు కారులో నాతో పాటు పిల్లలు, ఆయా ఉన్నారు. చిన్న చిన్న గాయాలు అయ్యాయి. మేమంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాం. చిన్నారి సాషా ఇంకా ఆసుపత్రిలో ఉంది. బ్యాడ్ టైమ్ నడుస్తోంది. మా కోసం దేవుడిని ప్రార్థించండి. చిన్నారి త్వరగా కోలుకోవాలని కోరుకోండి. మీ ప్రార్థనలు మాకు ఎంతో అవసరం’ అంటూ ఆమె పోస్ట్‌ చేసింది. కాగా ఈ ప్రమాదంలో కారు డోర్‌ పూర్తిగా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement