కొడుకు బారసాల పంక్షన్‌కి సీఎంని ఆహ్వానించిన హీరోయిన్‌! | Actress Pranitha Invites Karnataka CM Siddaramaiah For Her Son Naming Ceremony | Sakshi
Sakshi News home page

బారసాల పంక్షన్‌కి సీఎంని ఆహ్వానించిన పవన్‌ కల్యాణ్‌ హీరోయిన్‌!

Apr 20 2025 3:27 PM | Updated on Apr 20 2025 4:06 PM

Actress Pranitha Invites Karnataka CM Siddaramaiah For Her Son Naming Ceremony

హీరోయిన్‌ ప్రణీత గుర్తుందా..? ‘అమ్మో బాపు గారి బొమ్మో..’ అంటూ ‘అత్తారింటికి దారేది’ సినిమాలో పవన్‌ కల్యాణ్‌ని తన చుట్టూ తిప్పుకున్న ఈ బ్యూటీ..ఇప్పుడు ఇద్దరు పిల్లల తల్లి. కెరీర్‌ పీక్స్‌లో ఉండగానే 2021లో వ్యాపారవేత్త నితిన్‌ రాజును వివాహం చేసుకొని సినిమాలకు గుడ్‌బై చెప్పింది. ఇప్పటికే ఈమెకు ఒక పాప ఉండగా.. రీసెంట్‌గా ఒక బాబుకు కూడా జన్మనిచ్చింది.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకునే ప్రణీత, తాజాగా సీఎం సిద్ధరామయ్యతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసింది. “మా కొడుకు నామకరణ కార్యక్రమానికి కర్ణాటక గౌరవనీయ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని కలవడం, ఆహ్వానించడం ఆనందంగా ఉంది” అని ఆమె పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, కొంతమంది నెటిజన్లు ‘సూపర్’ అంటూ కామెంట్స్ చేయగా..మరికొంతమంది ‘బారసాలకు కూడా సీఎంని ఆహ్వానించడం ఏంటి? అని ట్రోల్‌ చేస్తున్నారు. కాగా, ప్రణీతకు సిద్ధరామయ్య కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆమె తరచూ వారి కుటుంబ సభ్యులను కలుస్తూ ఉంటారు. ఈ ఆహ్వానంతో ప్రణీత మరోసారి వార్తల్లో నిలిచారు.

ప్రణీత సినీ కెరీర్‌ విషయానికొస్తే.. “పోర్కి”తో సినీ రంగంలో అడుగుపెట్టారు. ఆ తర్వాత తెలుగులో ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమయ్యారు. “బావ” (2010), “అత్తారింటికి దారేది” (2013) వంటి తెలుగు చిత్రాలతో ఆమె విశేషమైన గుర్తింపు పొందారు. ముఖ్యంగా “అత్తారింటికి దారేది”లో పవన్ కల్యాణ్ సరసన నటించిన ప్రణవీ పాత్ర ఆమెకు విపరీతమైన పేరు తెచ్చిపెట్టింది. తమిళంలో “సగాప్తం” (2014), కన్నడంలో “బ్రహ్మ” (2014) వంటి చిత్రాల్లో కూడా నటించారు. ఆమె కెరీర్‌లో మొత్తం 20కి పైగా సినిమాల్లో పనిచేశారు.

Advertisement
 
Advertisement
Advertisement