Mamata Mohandas: నేను చెప్పేవరకు ఆ వార్తలను నమ్మకండి: మమతా మోహన్‌దాస్‌

Actress Mamtha Mohandas Clarifies on Her Health Rumours - Sakshi

‘యమదొంగ’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన బ్యూటీ మమతా మోహన్‌ దాస్‌. ఆ తర్వాత ఆమె చింతకాయల రవి సినిమాలో హీరోయిన్‌గా నటించి తెలుగులో మంచి గుర్తింపు పొందింది. ఇక ఆ తర్వాత సడెన్‌గా ఆమె తెరపై కనుమరుగైంది. గొంతు క్యాన్సర్‌ కారణంగా మమతా మోహన్‌ దాస్‌ నటనకు బ్రేక్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. సుదీర్ఘకాలం పాటు క్యాన్సర్‌తో పోరాడి గెలిచింది. ఈ వ్యాధి నుంచి బయట పడిన ఆనంతరం చికిత్స సమయంలో తీసుకున్న తన ఫొటోలను తరచూ షేర్‌ చేస్తూ క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తోంది. ఇక ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న ఆమె ఆరోగ్యంపై గత కొద్ది రోజులుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. మమతా మరోసారి క్యాన్సర్‌ బారిన పడిందని, తన ఆరోగ్యం క్షీణించిందంటూ రకరకాలు పుకార్లను ప్రచారం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై మమత స్పందించింది. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ షేర్‌ చేసింది. ఈ సందర్భంగా తన ఆరోగ్యంపై వస్తున​ వార్తలను ఆమె ఖండిచింది. ‘‘ఇటీవల నా ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలు చూసి నా అభిమానులు.. సన్నిహితులు ఆందోళన చెందుతున్నారు. వారు నాకు డీఎంఎస్, మెయిల్స్‌ చేస్తున్నారు. రీసెంట్‌గా నన్ను ఇంటర్వ్యూ చేశామని చెప్పుకుంటున్న కొన్ని యూట్యూబ్ ఛానల్సే ఈ వార్తలను ప్రచారం చేస్తున్నాయి. ప్రస్తుతం నేను ఆరోగ్యంగానే ఉన్నాను. మళ్లీ నేను క్యాన్సర్ బారిన పడలేదు. నా ఆరోగ్యం గురించి నేను చెప్పేవరకు ఎలాంటి వార్తలను నమ్మకండి. ఇదిగో నా తాజా ఫొటోలను షేర్‌ చేస్తున్నాను. ఇందులో నేను అనారోగ్యంతో ఉన్నట్లు కనిపిస్తున్నానా? నేను మరోసారి క్యాన్సర్‌కు లొంగిపోయేందుకు సిద్ధంగా లేను’’ ఆంటూ ఆమె స్పష్టం చేసింది. 

చదవండి: 
వైష్ణవిని హీరోయిన్‌గా పెట్టినప్పటి నుంచి బయటినుంచి ఫుల్‌ నెగిటివిటీ: దర్శకుడు
అరుణాచలేశ్వరుని సేవలో శ్రీకాంత్‌ దంపతులు 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top