విజయ్ దేవరకొండతో సినిమా.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే? | actress Keerthy suresh responds On Movie with Vijay Devarakonda | Sakshi
Sakshi News home page

keerthy Suresh: విజయ్ దేవరకొండతో సినిమా.. కీర్తి సురేశ్ సమాధానం ఇదే!

Jun 19 2025 9:37 PM | Updated on Jun 19 2025 9:42 PM

actress Keerthy suresh responds On Movie with Vijay Devarakonda

మహానటి కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో వస్తోన్న చిత్రం ఉప్పు కప్పురంబు. ఈ సినిమాలో టాలీవుడ్‌ హీరో సుహాస్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఫుల్ సెటైరికల్‌ కామెడీ ఓరియంటెడ్ మూవీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రానికి ఐవీ శశి దర్శకత్వం వహించారు. రాధికా ఎల్‌ నిర్మించిన ఈ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ కానుంది.

తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ట్రైలర్ లాంఛ్‌ ఈవెంట్‌లో కీర్తి సురేశ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానిలిచ్చారు. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండతో మీరు నటిస్తున్నారా? అంటూ ఆమె ప్రశ్నించారు. దీనిపై స్పందించిన కీర్తి సురేశ్.. ఈ విషయాన్ని దిల్‌ రాజు సార్ చెబుతారంటూ నవ్వుతూ మాట్లాడింది. కాగా.. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌ వీడియో వేదికగా జులై 4  నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఈ సినిమా గురించి కీర్తి సురేశ్ ఈవెంట్‌లో‌ మాట్లాడుతూ.. 'ఇప్పటివరకూ చాలా డార్క్‌ కామెడీ సినిమాలు చూసుంటారు. కానీ అన్నిటికంటే చాలా భిన్నంగా ఉంటుంది. కుటుంబమంతా ఇంట్లో కూర్చోని హాయిగా ఈ సినిమా చూడొచ్చు. ఒక సీరియస్‌ విషయాన్ని చాలా ఫన్నీగా చెప్పాం' అని అన్నారు. ఈ చిత్రంలో బాబు మోహన్, శత్రు, తాళ్లూరి రామేశ్వరి, శుభలేఖ సుధాకర్, రవితేజ, విష్ణు, దువ్వాసి మోహన్, శివన్నారాయణ, ప్రభావతి వర్మ ముఖ్య పాత్రలు పోషించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement