'నేను సడన్‌గా చనిపోతే..' ఏం చేయాలో ముందే చెబుతా..! | Aamir Khan Reveals Secret after His Sudden death in Flight | Sakshi
Sakshi News home page

Aamir Khan: 'నేను సడన్‌గా చనిపోతే..' ఏం చేయాలో ముందే చెబుతా..!

May 1 2026 7:47 PM | Updated on May 1 2026 7:47 PM

Aamir Khan Reveals Secret after His Sudden death in Flight

బాలీవుడ్ నటుడు అమిర్ ఖాన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన విమాన ప్రయాణానికి ముందు ఓ సీక్రెట్ నోట్ పంపుతానని తెలిపారు. ఒకవేళ ఏదైనా జరిగిన నేను చనిపోతే రన్నింగ్‌లో ఉన్న సినిమాను ఆపొద్దని దర్శకుడు మన్సూర్‌ ఖాన్‌కు పంపుతానని వెల్లడించారు. నేను చనిపోయినా కూడా పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉన్న సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపొద్దని చెప్తానని పేర్కొన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అమిర్ ఖాన్ ఈ కామెంట్స్ చేశారు.

అమిర్ ఖాన్ మాట్లాడుతూ.. 'ఏదైనా సినిమా షూటింగ్‌ మొత్తం పూర్తయి చివరి దశలో ఉన్నప్పుడు నేను విమాన ప్రయాణం చేయాల్సి వస్తే  మన్సూర్‌కు ఓ సీక్రెట్‌ నోట్‌ పంపుతా.  ఒకవేళ తాను ప్రయాణించే ఫ్లైట్ కూలిపోయి చనిపోతే.. ఆ సినిమా పనులు నువ్వే చూసుకో అని రాసి పంపిస్తా. అంతేకాకుండా దర్శకులతో కూడా ఇదే విషయాన్ని చెబుతా. నాకు ఏ ఆపద వచ్చినా సినిమాను ఆపొద్దని.. మన్సూర్‌తో కలిసి మూవీని విడుదల చేయాలని కోరతా' అని అన్నారు. ఫ్లైట్‌ జర్నీ చేసేటప్పుడు ఏదైనా ఆపద వస్తుందనే భయం నాలో ఉందన్నారు. కాగా.. దర్శకుడు మన్సూర్‌ ఖాన్‌, ఆమిర్‌ ఖాన్‌ ఇద్దరు బంధువులు కావడం విశేషం. వీరిద్దరి కాంబోలో ఖయామత్ సే ఖయామత్ తక్, జో జీతా వహీ సికందర్ లాంటి సూపర్ హిట్‌ సినిమాలు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement