Aam Aha Movie: అలా రెండు సార్లు జరిగినా తట్టుకున్నాం: నిర్మాత

Aam Aha Movie Pre Release Event - Sakshi

Aam Aha Movie Pre Release Event: డిఫరెంట్ టైటిల్, నేటితరం ఆడియన్స్ కోరుకునే థ్రిల్లింగ్ సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది 'అం అః' మూవీ. మునుపెన్నడూ చూడని విభిన్నమైన కథకు తెరరూపమిస్తూ డైరెక్టర్ శ్యామ్ మండ‌ల ఈ సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది. సుధాక‌ర్ జంగం, లావ‌ణ్య హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ 'అం అః' చిత్రానికి ‘ఎ డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్’ ట్యాగ్‌లైన్‌ పెట్టారు. రంగ‌స్థ‌లం మూవీ మేక‌ర్స్‌, శ్రీ ప‌ద్మ ఫిలిమ్స్ బ్యాన‌ర్స్‌పై జోరిగె శ్రీనివాస్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్ట్ 19న విడుదల కాబోతోంది. ప్రమోషన్‌లో భాగంగా తాజాగా చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఏర్పాటు చేసింది మూవీ యూనిట్. 

నిర్మాత శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. ‘ఈ సినిమాను ప్రారంభించడానికి చాలా టైం పట్టింది. ముందు శ్యాం గారు నా వద్దకు ఓ కథ తీసుకొని వచ్చారు. అయితే దానికి ఎక్కువ బడ్జెట్ అవుతుందనిపించింది. ఆ తరువాత నవీన్ గారు మరో కథను తీసుకొచ్చారు. దాని మీద చాలా పని చేశాం. ఈ కథకు కొత్త వాళ్లు అయితే బాగుందని అనుకున్నాం. ఆ టైంలో మాకు సుధాకర్ కనిపించారు. ఈ సినిమా సమయంలో రెండుసార్లు పాండమిక్‌ వచ్చింది. అయినా తట్టుకున్నాం. దర్శకుడు ఎంతో కష్టపడి ఈ సినిమాను చేశారు. ఇందులో శ్యామ్ గారి పనితనం చూస్తే మైండ్ బ్లాక్ అవుతంది.. మళ్లీ మళ్లీ సినిమాను చూస్తారు. అంత గ్రిప్పింగ్‌గా ఉంటుంది. ఒళ్లంతా రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటుంది. సినిమాను చూసి విజయవంతం చేయాలని మనసారా కోరుకుంటున్నాను’ అని తెలిపారు. 

 సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఈ స్థాయి వరకు నేను రావడానికి ఎంతో మంది త్యాగం ఉంది. అం అ: టీం నన్ను నమ్మింది. సక్సెస్ అవుతాడా? లేదా? అనే ఆలోచనలు పెట్టుకోకుండా నన్ను నమ్మి ఇంత వరకు తీసుకొచ్చారు. నా కుటుంబం నాకు అండగా నిలబడింది. నా నిర్మాతలు నన్ను నమ్మి.. వారి టైం, డబ్బు నా మీద ఖర్చు పెట్టినందుకు రుణపడి ఉంటాను. నాతో వర్క్ షాప్‌లు చేయించి ఇంత బాగా సినిమాను తీసిన దర్శకుడికి ధన్యవాదాలు’ అని పేర్కొన్నాడు.  ‘నేను అనంతపురం అమ్మాయిని. బెంగళూరులో ఉంటాను. షార్ట్ ఫిల్మ్స్ చేస్తుండేదాన్ని. ఇలాంటి చిత్రంలో నాకు ఆఫర్ వస్తుందని నేను అనుకోలేదు. శ్యామ్ సర్ పెద్ద పెద్ద ఆర్టిస్టులతో పని చేశారు. కానీ నాకు ఈ అవకాశం ఇచ్చారు. నన్ను నమ్మి ఈ పాత్రను ఇచ్చినందుకు థాంక్స్. నాకు సపోర్ట్ ఇచ్చిన నిర్మాత, హీరోకు థాంక్స్’ అని హీరోయిన్‌ సిరి కనకాల తెలిపింది. 

 డైరెక్టర్ శ్యామ్ మండల మాట్లాడుతూ.. ‘ఇది నాకు ఫస్ట్ థియేటర్ మూవీ. నాకు ఈ అవకాశం అంత ఈజీగా రాలేదు. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. నా కల సాకారం అవ్వడానికి మా నిర్మాత కారణం. సురేందర్ రెడ్డి, గుణ శేఖర్, వైవీఎస్ చౌదరిల వద్ద ఓ పదమూడేళ్లు పని చేశాను. స్క్రీన్ ప్లే ఎంగేజింగ్‌గా ఉండేలా కథ రాసుకుంటారు. వారి దగ్గరి నుంచి అది నేను నేర్చుకున్నాను. ఇందులో అప్లై చేశాను. నాకు ఈ టీం అంతా కూడా ఎంతో సహకరించింది. నవీన్ ఇరగాని నాకు ఈ సబ్జెక్ట్‌ అందించి సాయం చేశారు. కరోనా సమయంలో ఈ సినిమాను ప్రారంభించాం. కరోనా మధ్యలో ఓ చిన్న చిత్రం చేశాం. ట్రూ అనే చిత్రం అమెజాన్‌లో 25 రోజులు టాప్ వన్ ప్లేస్‌లో ట్రెండ్ అయింది. దాని కంటే వంద శాతం ఎక్కువగా కష్టపడ్డాం. ఆ సినిమా కంటే ఇది పదిరెట్లు ఎక్కువగా ఉంటుంది’ పేర్కొన్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top