నాణ్యమైన విద్య అందించాలి | - | Sakshi
Sakshi News home page

నాణ్యమైన విద్య అందించాలి

Jul 29 2026 9:51 AM | Updated on Jul 29 2026 9:51 AM

టేక్మాల్‌(మెదక్‌): గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని జిల్లా విద్యాధికారి రాజు పేర్కొన్నారు. నూతన విద్యావిధానంలో భాగంగా విద్యార్థుల్లో ప్రాథమిక చదవడం, రాయడం, గణిత నైపుణ్యాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న మూడు రోజుల ఎఫ్‌ఎల్‌ఎన్‌ శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం జిల్లా విద్యాధికారి రాజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 5వ తరగతి పూర్తయ్యేలోపు ప్రతి విద్యార్థి తప్పనిసరిగా వయస్సుకు తగిన స్థాయిలో చదవడం, రాయడం, ప్రాథమిక గణిత నైపుణ్యాలను సాధించాలని తెలిపారు. ఉపాధ్యాయులు శిక్షణలో నేర్చుకున్న వినూత్న బోధనా పద్ధతులను తరగతి గదిలో సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. విద్యార్థి కేంద్రిత బోధన, ఆటల ద్వారా అభ్యాసం, కార్యాచరణ ఆధారిత బోధన, నిరంతర మూల్యాంకనం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అనంతరం పీఆర్టీయూ మండల పక్షాన డీఈఓను సన్మానించారు. కార్యక్రమంలో సీఎంఓ రాజు, మండల విద్యాధికారి సుజాత, స్థానిక హెచ్‌ఎం రాజేంద్రప్రసాద్‌, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు సతీష్‌ రావు, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అమీరుద్దీన్‌, సహదేవ్‌, రిసోర్స్‌ పర్సన్లు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా విద్యాధికారి రాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement