కౌడిపల్లి(నర్సాపూర్): ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టి రోడ్డు ప్రమాదాలు జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు పోలీసులను ఆదేశించారు. మంగళవారం కౌడిపల్లి పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్ నిర్వహణ, రికార్డులు, పెండింగ్ కేసులు, నేర నియంత్రణ చర్యలు, సిబ్బంది విధి నిర్వహణతో పాటు పరిసరాలు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మద్యం మత్తులో వాహనాలు నడపడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేయాలన్నారు. పోలీసులు ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించాలని సూచించారు. పెండింగ్ కేసులను వేగవంతం చేసి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ తనిఖీల్లో ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ సందీప్‌రెడ్డి, నర్సాపూర్ సీఐ రంగకృష్ణ, ఎస్‌ఐ అమరేందర్‌రెడ్డి, పోలీసులు పాల్గొన్నారు.
జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు


