జిల్లాలో కోతుల బెడద అరికట్టాలి | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో కోతుల బెడద అరికట్టాలి

Jul 29 2026 9:51 AM | Updated on Jul 29 2026 9:51 AM

రామాయంపేట(మెదక్‌): జిల్లాలో కోతుల బెడదను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ స్పష్టం చేశారు. ఆమె మంగళవారం స్థానిక రైతువేదికలో జరిగిన విత్తన మేళాలో పాల్గొని మాట్లాడారు. అదిలాబాద్‌ జిల్లాలో అక్కడి అధికారులు కోతుల బెడదను అరికట్టేందుకు అవలంబించిన పద్ధతులను అధ్యయనం చేయడానికిగాను జిల్లా అధకారులు త్వరలో అదిలాబాద్‌ జిల్లాలో పర్యటిస్తారని ఆమె పేర్కొన్నారు. ఎల్‌నినో పరిస్థితుల దృష్ట్యా రైతులు వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలైన ఆయిల్‌పామ్‌, పప్పు ధాన్యాలు, నూనె గింజలు, చిరుధాన్యాలు, కూరగాయలు పంటలు సాగుచేయాలని సూచించారు. జిల్లా వ్యవసాయ అధకారి దేవ్‌కుమార్‌, జిల్లా ఉద్యాన అధికారి ప్రతాప్‌సింగ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ లావణ్య, వైస్‌ చైర్మన్‌ నవనీత, ఆత్మ పీడీ రుద్రమూర్తి, మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్‌కుమార్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ ప్రతిమా సింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement