గిరిజన బాలికలు చదువులో ముందుండాలి | - | Sakshi
Sakshi News home page

గిరిజన బాలికలు చదువులో ముందుండాలి

Jul 29 2026 9:51 AM | Updated on Jul 29 2026 9:51 AM

కౌడిపల్లి(నర్సాపూర్‌): గిరిజన బాలికలు చదువులో ముందుండాలని గోర్‌సేన రాష్ట్ర అధ్యక్షుడు జగన్‌నాయక్‌ తెలిపారు. కౌడిపల్లిలోని ఎస్టీ బాలికల మినీ గురుకుల పాఠశాలలో గోర్‌సేన ఆధ్వర్యంలో మంగళవారం బోగ్‌బండార్‌ పూజాకార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...బాలికలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారని చెప్పారు. గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలు పాటించాలని క్రమశిక్షణతో పెద్దల పట్ల గౌరవం, మర్యాద ఉండాలన్నారు. చదువుతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రాములునాయక్‌, మండల అధ్యక్షుడు జవహర్‌నాయక్‌, నాయకులు కొర్రశ్రీను, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

గోర్‌సేన రాష్ట్ర అధ్యక్షుడు జగన్‌నాయక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement