సెప్టెంబర్‌లో జిల్లాస్థాయి క్రీడలు | - | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్‌లో జిల్లాస్థాయి క్రీడలు

Jul 16 2026 7:18 AM | Updated on Jul 16 2026 7:18 AM

అదనపు కలెక్టర్‌ నగేశ్‌

అదనపు కలెక్టర్‌ నగేశ్‌

మెదక్‌ కలెక్టరేట్‌: సెప్టెంబర్‌ మొదటి వారంలో జిల్లాస్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తామని అదనపు కలెక్టర్‌ నగేశ్‌ తెలిపారు. బుధవారం డీఈఓ అధ్యక్షతన కలెక్టరేట్‌లో జిల్లాలోని పీడీలు, పీఈటీలతో సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆగస్టు 25 లోపు మండ లస్థాయి క్రీడా పోటీలను పూర్తి చేయనున్నట్లు తెలిపారు. అనంతరం జిల్లాస్థాయి క్రీడా పోటీలు ప్రారంభమవుతాయని చెప్పారు. పోటీల నిర్వహణ లో నాణ్యత, సమయపాలనకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసి పకడ్బందీగా క్రీడలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. అలాగే రాష్ట్రస్థాయికి ఎంపికై న క్రీడాకారులకు దుస్తులు అందించే విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు హామీ ఇచ్చారు. అనంతరం ఎస్‌జీఎఫ్‌ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. క్రీడాకారులు వారికి నైపుణ్యం గల ఆటలలో ప్రతిభ కనబరచడానికి ఈ పోర్టల్‌ ఒక వేదికగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో డీఈఓ రాజు, ఏఎంఓ సుదర్శనమూర్తి, పీటీల సంఘం రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షుడు నాగరాజు, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి మధు, శ్రీధర్‌ రెడ్డి, మాధవరెడ్డి, శ్యామ్‌, రూపేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement