రసాయన మందులు వాడకం తగ్గించాలి | - | Sakshi
Sakshi News home page

రసాయన మందులు వాడకం తగ్గించాలి

Apr 18 2026 8:17 AM | Updated on Apr 18 2026 8:17 AM

కౌడిపల్లి(నర్సాపూర్‌): రైతులు పంటసాగులో మోతాదుకు మించి రసాయన ఎరువులు వాడటంవల్ల భూసార తగ్గడంతోపాటు దిగుబడి తగ్గుతోందని తునికి కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) శాస్త్రవేత్త డాక్టర్‌ రవికుమార్‌ తెలిపారు. శుక్రవారం మండలంలోని ధర్మాసాగర్‌లో సమతుల్య ఎరువులు వినియోగం, భూపోషణపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. రైతులు పంటమార్పిడి చేయాలన్నారు. పంటదిగుబడి ఎక్కువ రావాలని, మోతాదుకు మించి యూరియా, డీఏపీ వాడుతున్నారని, దీంతో భూసారం తగ్గుతోందన్నారు. పంటకు తెగులు, పురుగులు సోకుతున్నాయని చెప్పారు. భూసారం కోసం పచ్చారొట్ట ఎరువులు జీలుగు, జనుము సాగు చేయాలన్నారు. బయోఫర్టిలైజర్‌ (జీవన ఎరువులు) వాడాలని దీంతో నేల బాగుంటుందని తెలిపారు. వేసవిలో లోతు దుక్కులు దున్నడంవల్ల సూక్ష్మజీవులు నశిస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ శివారెడ్డి, ఏఓ స్వప్న, ఉపసర్పంచ్‌ అశోక్‌గౌడ్‌, నాయకులు సంతోష్‌గౌడ్‌, శ్రీనివాస్‌, రాజాగౌడ్‌, రైతులు పాల్గొన్నారు.

పచ్చిరొట్ట, జీవన ఎరువులు వాడాలి

కేవీకే శాస్త్రవేత్త డాక్టర్‌ రవికుమార్‌

Advertisement
 
Advertisement
Advertisement