నీటి సమస్యల పరిష్కారానికి చర్యలు | - | Sakshi
Sakshi News home page

నీటి సమస్యల పరిష్కారానికి చర్యలు

Apr 18 2026 8:17 AM | Updated on Apr 18 2026 8:17 AM

పెద్దశంకరంపేట(మెదక్‌): వేసవిలో నీటి సమస్యలు రాకుండా పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు జెడ్పీ సీఈఓ ఎల్లయ్య తెలిపారు. శుక్రవారం మండల పరిషత్‌ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు, ఉద్యోగుల హాజరుశాతాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బోరంచ నుంచి మండలానికి వచ్చే నీటి సరఫరా తగ్గిపోవడంతో సమస్య ఏర్పడుతుందన్నారు. ఈ సమస్య పరిష్కారానికి ఆయా గ్రామపంచాయతీల్లోని నిధులను ఉపయోగించి బోర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ క్రాంతికుమార్‌, సూపరిండెంట్‌ షాకీర్‌అలీ తదితరులున్నారు.

తాగునీటి సమస్య రానివ్వం..

రేగోడ్‌(మెదక్‌): తాగునీటి సమస్య రానివ్వమని జెడ్పీ సీఈఓ ఎల్లయ్య ప్రజలకు సూచించారు. మండల కేంద్రంలోని మండల పరిషత్‌ కార్యాలయాన్ని శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ మేరకు పలు రికార్డులను పరిశీలించి ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక అంశాలపై ఎంపీడీఓ సీతారావమ్మతో చర్చించారు.

జెడ్పీ సీఈఓ ఎల్లయ్య

Advertisement
 
Advertisement
Advertisement