మెదక్ కలెక్టరేట్: మెదక్ నుంచి బొడ్మట్‌పల్లికి రాత్రి 7:15 గంటల బస్సును పునరుద్ధరించాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేశారు. బుధవారం డిపోలో డీఎం సురేఖ ప్రయాణికుల సమస్యలు తెలుసుకునేందుకు ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా నలుమూలల నుంచి ప్రయాణికులు ఫోన్ ద్వారా వారి సమస్యలను డీఎంకు వివరించారు. బొడ్మట్‌పల్లి నుంచి తిరిగివచ్చే సమయంలో ప్రయాణికులు ఏ మాత్రం ఉండటం లేదని, అందుకే ఆ సర్వీస్‌ను రద్దు చేసినట్లు డీఎం చెప్పారు. అదేవిధంగా జేబీఎస్ నుంచి రామాయపేటకు బస్సు నడిపించాలని, మెదక్ నుంచి కొడపాకకు అదనపు ట్రిప్పు వేయాలని పలువురు కోరారు. ప్రయాణికుల విజ్ఞప్తులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని డీఎం సురేఖ తెలిపారు.


