విద్యార్థినులతో మాట్లాడుతున్న కలెక్టర్
రామాయంపేట(మెదక్): హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలల్లో మెనూ ప్రకారం భోజనం పెట్టాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ సిబ్బందిని ఆదేశించారు. బుధవారం ఆమె రామాయంపేటలో కేజీబీవీ పాఠశాలను సందర్శించి మాట్లాడారు. హాస్టల్‌లో నెలకొన్న నీటి ఎద్దడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులకు పెట్టే అహారం నాణ్యతగా ఉండాలని, వంటగది పరిశుభ్రతపై దృష్టి పెట్టాలన్నారు. అనంతరం పదో తరగతి విద్యార్థులకు సోషల్ పాఠం బోధించి, వారి అనుమానాలు నివృత్తి చేశారు. పరీక్షల సమయంతో సమయానికి భోజనం చేయడంతో పాటు కంటి నిండా నిద్రపోవాలని సూచించారు. పట్టుదలతో చదివి మంచి మార్కులు సాధించాలన్నారు. అనంతరం దామరచెరువులో రేషన్ దుకాణాన్ని సందర్శించారు. ఆమె వెంట తహసీల్దార్ రజని, ఇతర అధికారులున్నారు.
ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం
మెదక్ కలెక్టరేట్: గర్భిణులు, బాలింతలకు అవసరమైన వైద్య పరీక్షలపై అవగాహన కల్పించడమే ‘సేఫ్ మదర్ డే’ ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ ప్రతి మాసింగ్ అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం కలెక్టరేట్‌లో సురక్షిత మాతృత్వ దినోత్సవం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హెల్త్ వీక్ ద్వారా ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు, వైద్యులు గ్రా మీణ స్థాయిలో ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పి ంచాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, డీఎంహెచ్‌ఓ శ్రీరాం, డీఎంఏ సూపరింటెండెంట్ సునీత, డీసీహెచ్‌ఎస్ శివదయాల్, గైకాలజిస్ట్ రాజేశ్వరి, మున్సిపల్ వైస్ చైర్మన్ నరేశ్‌గౌడ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రతిమాసింగ్


