నర్సాపూర్: ఆర్టిజన్లకు ఏపీఎస్‌ఈబీ సర్వీస్ రూల్స్‌ను వెంటనే అమలు చేయాలని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు స్వామి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన నర్సాపూర్ సబ్ డివిజన్ పరిధిలోని ఆర్టిజన్లతో కలిసి మాట్లాడారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు తమ సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఆయన వెంట నాయకులు షాదుల్లా, సురేశ్, జనార్దన్, నర్సింగ్‌రావు, నాగరాజు, సందీప్‌రెడ్డి, మణికంఠరెడ్డి, సుజిత్, వినోద్, వెంకటేష్, లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.
ఇళ్ల నిర్మాణాలు త్వరగా
పూర్తి చేయాలి
చిలప్‌చెడ్(నర్సాపూర్): ఇందిరమ్మ ఇళ్ల నిర్మా ణాలు త్వరితగతిన పూర్తి చేయాలని జెడ్పీ సీఈఓ ఎల్లయ్య లబ్ధిదారులకు సూచించారు. బుధవారం మండలంలోని ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులు పరిశీలించారు. అనంతరం గ్రామంలో పలు ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి మాట్లాడారు. పైలెట్ ప్రాజెక్ట్‌గా ఎంపికై న చిలప్‌చెడ్‌కు 56 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, 5 నిర్మాణాలు పూర్తయ్యే దశకు చేరుకున్నాయని తెలిపారు. సరైన నిబంధనల ప్రకారం ఇళ్లు నిర్మిస్తేనే లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమవుతాయన్నారు. ఆయన వెంట సర్పంచ్ జూల అనిల్, ఎంపీడీఓ ప్రశాంత్, ఎంపీఓ తిరుపతి ఉన్నారు.
నేడు విద్యుత్ సరఫరాలో
అంతరాయం
పాపన్నపేట(మెదక్): సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా నార్సింగి సబ్‌స్టేషన్ పరిధిలో పను లు జరుగుతున్నాయని, గురువారం వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ నర్సింలు తెలిపారు. నార్సింగి ఎక్స్‌ప్రెస్ ఫీడర్, అగ్రికల్చర్ ఫీడర్లకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 వరకు విద్యుత్ సరఫరా ఉండదని పేర్కొన్నారు.
భూముల రీ సర్వేకు సహకరించండి
నర్సాపూర్ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భూముల రీ సర్వేకు సహకరించాలని ఆర్డీఓ రామకృష్ణ కోరారు. ఈ విషయమై బుధవారం మండలంలోని ఎల్లాపూర్‌లో రైతులకు అవగాహన కల్పించారు. భూ సరిహద్దులు, విస్తీర్ణం, సర్వే నంబర్లు తదితర సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం రీ భూ సర్వే చేపట్టిందన్నారు. సర్వే పూర్తయితే భూ వివాదాలు పూర్తిగా లేకుండా పోతాయని వివరించారు. కార్యక్రమంలో ఏడీ సర్వేయర్ రాంరెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, డీఐ రామ్‌రెడ్డి, డీటీ హేమలత, ఆర్‌ఐలు ప్రభాకర్‌రెడ్డి, సిద్దిరామిరెడ్డి, సర్వేయర్ అభిలాష్, ఉపసర్పంచ్ నరసింహగౌడ్, గ్రామస్తులు పాల్గొన్నారు.
జాతీయ సాఫ్ట్‌బాల్
పోటీలకు ఎంపిక
నంగునూరు(సిద్దిపేట): జాతీయ స్థాయి అండర్ 14 సాఫ్ట్‌బాల్ పోటీలకు గట్లమల్యాల ఉన్నత పాఠశాల 8వ తరగతి విద్యార్థి బానోత్ అర్చన ఎంపికయ్యారు. మహబూబాబాద్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఉమ్మడి మెదక్ జిల్లా జట్టు తరుపున ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఈనెల 16 నుంచి ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నట్లు హెచ్‌ఎం రమేశ్, ఫిజికల్ డైరెక్టర్ రాజ్‌కుమార్ తెలిపారు. జాతీయ జట్టుకు ఎంపికై న విద్యార్థిని సర్పంచ్ నరేశ్, ఉపసర్పంచ్ శ్రీనివాస్, హస్టల్ వార్డెన్ మాధవి, ఉపాధ్యాయులు అభినందించారు.


