మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం | - | Sakshi
Sakshi News home page

మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం

Mar 30 2026 12:01 PM | Updated on Mar 30 2026 12:01 PM

నర్సాపూర్‌ రూరల్‌: మండలంలోని పెద్దచింతకుంటలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్‌ మల్లేశ్‌గౌడ్‌ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి ఆదివారం క్షీరాభిషేకం చేశారు. ఈసందర్భంగా మల్లేశ్‌గౌడ్‌ మాట్లాడుతూ.. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచమంతా ఇంధన సంక్షోభంతో అల్లాడుతుంటే మోదీ సామాన్య ప్రజలపై భారం పడకుండా పెట్రోల్‌, డీజిల్‌పై ఎకై ్సజ్‌ సుంకాన్ని భారీగా తగ్గించారని కొనియాడారు. కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాపగారి రమేశ్‌గౌడ్‌, మండల అధ్యక్షుడు నీలి నాగేశ్‌, నాయకులు నారాయణరెడ్డి, బాలు, యాదగిరి, నగేశ్‌గౌడ్‌, సంజీవులు సాయిచారి, బాలరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement