చిన్నశంకరంపేట(మెదక్): ఉల్లాస్ కార్యక్రమం ద్వారా నిర్వహిస్తున్న అమ్మకు అక్షరమాల మూ ల్యంకన పరీక్షలను కేంద్ర ప్రభుత్వ అక్షరాస్యత మంత్రిత్వశాఖ అధికారి భాను బోరా పరిశీలించారు. ఆదివారం విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ వెంకట్‌రెడ్డి, వయోజన విద్య జిల్లా అధికారి మురళీమోహన్‌తో కలిసి మండలంలోని అవబాజిపేటలో పర్యటించారు. మహిళా సంఘం సభ్యులను గుర్తించి వలంటీర్ల ద్వారా అక్షరాభ్యాసం చే యించినట్లు అధికారులు తెలిపారు. మహిళల అక్షరాభ్యాసన శక్తిని పరిశీలించేందుకే మూల్యంకన పరీక్షలు నిర్వహించామన్నారు.


