చిన్నశంకరంపేట(మెదక్): చిన్నశంకరంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరంలో 193 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. శనివారం ప్రత్యేక వైద్య శిబిరాన్ని వైద్యాధికారి డాక్టర్ సాయిసింధు, స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎముకలు, నేత్రవైద్యం, మహిళలు, చిన్నపిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరంలో పలువురు వైద్యులు పాల్గొని సేవలు అందించారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సాయిసింధు, పల్లె దవాఖాన డాక్టర్లు హృదయ్, హరిక, నందిని, కుమారి, సూపర్‌వైజర్లు నిర్మల, బుజ్జి, సిబ్బంది వనిత, అనిత, నర్సింహులు, యాదగిరావు, ఉపసర్పంచ్ భానుప్రసాద్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.


