నర్సాపూర్: నర్సాపూర్‌లోని విష్ణు ఉన్నత పాఠశాలలో శనివారం గ్రాడ్యుయేషన్ డే సంబరాలు ఘనంగా నిర్వహించారు. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థులు సాధించిన విజయాలు, నైపుణ్యాలను గుర్తించి వారిని ప్రోత్సహించేందుకు సంబరాలు నిర్వహిహించినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ నాగజ్యోతి చెప్పారు. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో బీవీ రాజు ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ సంజయ్‌దూబె, డైరెక్టర్ లక్ష్మీప్రసాద్, వైపర్ ప్రిన్సిపాల్ రమేష్, మేనేజర్ బాపిరాజు, ఏఓ సురేష్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సర్టిఫికెట్లు, మెమోంటోలు అందచేశారు.


