శివ్వంపేట(నర్సాపూర్): మండల కేంద్రం శివ్వంపేట లో కొలువైన పురాతన కోదండరామస్వామి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ప్రతి ఏటా శ్రీరామనవమి రోజున సీతారామచంద్రస్వామి కల్యాణం అనంతరం వారం రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. అనంతరం కోదండరామస్వామికి ప్రత్యేక పూజలు చేశా రు. సాయత్రం స్వామివారి పల్లకీ సేవ గ్రామంలోని ప్రధాన వీధులు గుండా చేపట్టారు. ఏప్రిల్ 2న గరుడసేవ నిర్వహించనున్నట్లు వేద పండితుడు శా స్త్రుల వామనశర్మ, సర్పంచ్ వెంకటేశ్వర్లు, ఆలయ పూజారి చందు తెలిపారు.


