పెద్దశంకరంపేట(మెదక్): వాహనదారులు రోడ్డు భద్రత నిబంధనలు తప్పకుండా పాటించాలని ఎస్‌ఐ.ప్రవీణ్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం పెద్దశంకరంపేటలో ప్రజలకు రోడ్డు రవాణా నిబంధనలు వివరించారు. ప్రభుత్వం ప్రజలు క్షేమంగా ఇంటికి చేరుకునేందుకు అరైవ్– అలైవ్ కార్యక్రమం ప్రారంభించిందన్నారు. ప్రయాణికులు హెల్మెట్ ధరించడంతో పాటు మద్యం సేవించి, సెల్‌ఫోన్ మాట్లాడుతూ.. వాహనాలు నడపరాదని, జాతీయ రహదారిపై రాంగ్‌రూట్లో ప్రయాణించవద్దని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్‌ఐ. సంగమేశ్వర్, సిబ్బంది పాల్గొన్నారు.
ఘనంగా పార్వతీ
పరమేశ్వరుల కల్యాణం
చిన్నశంక్రంపేట(మెదక్): మండల పరిధి గవ్వలపల్లి గ్రామంలో శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో శనివారం పార్వతీ పరమేశ్వరుల కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద మంత్రోచ్ఛరణల మధ్య కల్యాణ మహోత్సవం అంగరంగా వైభవంగా సాగింది. మహిళలు పార్వతీపరమేశ్వరులకు ఓడిబియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు.
రాజీయే రాజమార్గం
నర్సాపూర్ రూరల్: రాజీపడటం రాజమార్గమని న్యాయమూర్తి హేమలత కక్షిదారులకు సూచించారు. శనివారం నర్సాపూర్ మున్సిఫ్ కోర్టు ఆవరణలో లోక్ అదాలత్ నిర్వహించి పలు కేసుల్లో ఇరువర్గాల కక్షిదారులతో రాజీ కుదిర్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. క్షణికావేశంలో ఒకరిపై ఒకరు దూషించుకొని, కొన్ని సందర్భాల్లో దాడులు చేసుకొని పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదు చేసుకొని కోర్టుల చుట్టూ తిరుగుతూ డబ్బు, సమయం వృథా చేసుకుంటున్నారని అన్నారు. చాలా మంది ఇగోలతో కొట్లాడుకోవడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరు చట్టాలపై అవగాహన పొందుతూ శాంతియుత వాతావరణంలో ఉండాలని చెప్పారు. కార్యక్రమంలో ప్రభుత్వ న్యాయవాది రాఘవేందర్, సీనియర్ న్యాయవాది అంజిరెడ్డి, ఏజీపీ శ్రీధర్‌రెడ్డి, న్యాయవాదులు శ్రీనివాస్ గౌడ్, మధుశ్రీ, స్వరూపరాణి, శ్రీనివాస్, సత్యనారాయణ, సుధాకర్, ఆనంద్ కుమార్ పాల్గొన్నారు.
కొండగట్టుకు పాదయాత్ర
చేగుంట(తూప్రాన్): మండలంలోని గోపాల్‌పురం నుంచి హనుమాన్ మాలధారణ భక్తులు కొండగట్టుకు శనివారం పాదయాత్రగా బయలుదేరారు. మాజీ వైస్‌ఎంపీపీ రాంచంద్రం ఆధ్వర్యంలో 12 మంది హనుమాన్ మాల ధరించి కొండగట్టుకు పాదయాత్రగా వెళ్లి దీక్షను విరమించనున్నట్లు తెలిపారు. నాలుగు రోజుల పాటు పాదయాత్రగా వెళ్లి మంగళ వారం కొండగట్టుకు చేరుకుంటారని చెప్పారు.
ఆలయానికి విరాళం అందజేత
అల్లాదుర్గం(మెదక్): తల్లికి గుండెపోటు రావడంతో పెద్దమ్మ తల్లికి మొక్కుకున్నారు. అమ్మ వారి దయతో క్షేమంగా కోలుకోవడంతో విరా ళం అందజేశారు. బీరంగూడకు చెందిన అనిల్‌రాజ్ తన తల్లికి గుండెపోటు రావడంతో అనారోగ్యం నుంచి కాపాడాలని, క్షేమంగా ఉంటే రూ.లక్ష ఆలయానికి విరాళం ఇస్తానని రాంపూ ర్ పెద్దమ్మ తల్లికి మొక్కుకున్నాడు. అనిల్ రాజ్ తల్లి కోలుకోవడంతో శనివారం రాంపూర్ పెద్ద మ్మ తల్లికి స్థానిక సర్పంచ్ గోపాల్‌రెడ్డి, మాజీ సర్పంచ్ వెంకట్‌రెడ్డి, బల్‌రాంరెడ్డి, వెంకటేశ్ సమక్షంలో రూ.లక్ష విరాళం అందజేశారు.


