నర్సాపూర్ రూరల్: నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం కెమిస్ట్రీ విభాగం, ప్లేస్‌మెంట్ సెల్ ఆధ్వర్యంలో ఎంఎస్‌ఎన్ ఫార్మా సంస్థకు సంబంధించి ప్లేస్ మెంట్‌డ్రైవ్ నిర్వహించారు. ప్లేస్ మెంట్ డ్రైవ్ లో ఔషధ పరిశ్రమలో ఉద్యోగ అవకాశాలు, నైపుణ్యాలు, కెరీర్ అభివృద్ధిపై అవగాహన కల్పించారు. కళాశాలకు చెందిన సుమారు పదిమందికి పైగా విద్యార్థులు ప్లేస్‌మెంట్ పొందారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ సమీరా నజ్మీన్, అధ్యాపకులు డాక్టర్ అదెప్ప, డాక్టర్ కే రమేష్, ఎండీ ఖాజా ఆరిఫ్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.


