సంక్షేమ పద్దు పొడుపు | - | Sakshi
Sakshi News home page

సంక్షేమ పద్దు పొడుపు

Mar 21 2026 6:40 AM | Updated on Mar 21 2026 6:40 AM

ప్రజలను మభ్యపెట్టారు బడ్జెట్‌ కేవలం ప్రజలను మభ్యపెట్టే విధంగా ఉంది. ఆరు గ్యారంటీలకు నిధులు మరిచారు. విద్యా, వైద్యానికి అరకొరగా కేటాయింపులు చేశారు. కాళేశ్వరం కాలువలను పట్టించుకోలేదు. ఇరిగేషన్‌కు కేటాయించిన నిధులు జిల్లాకు ఉపయోగిస్తారా..? లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. మహిళలు కోటీశ్వరులను చేస్తామని అరకొర నిధులు – పద్మారెడ్డి, మెదక్‌ మాజీ ఎమ్మెల్యే విద్యారంగాన్ని మరిచారు విద్యకు పెద్దపీట వేస్తామంటూ సర్కార్‌ బడ్జెట్‌లో కేవలం 8.2 శాతం నిధులు కేటాయించి నిరాశపరిచింది. ఉపాధ్యాయుల పెండింగ్‌ బిల్లులు, పీఆర్సీ ప్రస్తావన లేదు. గత రెండేళ్లుగా రిటైర్డ్‌ అయిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు బెన్‌ఫిట్స్‌ అందలేదు. ఈ బడ్జెట్‌లో వాటి గురించి పట్టించుకోలేదు. – మల్లారెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు

జిల్లా ప్రగతికి ఇతోధిక సహకారం ప్రత్యేక నిధులు నిల్‌ సర్వత్రా భిన్నాభిప్రాయాలు

అసెంబ్లీలో శుక్రవారం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన పద్దు సంక్షేమ మంత్రం జపించింది. అన్నివర్గాలను లక్ష్యంగా చేసుకుని వరాల వాన కురిపించింది. విద్యార్థులను మురిపించి.. అన్నదాతలను మెప్పించి.. పేదలకు బీమా కల్పిస్తూ బడ్జెట్‌ పద్దు బహుబాగు అనిపించింది. అదే సమయంలో జిల్లాకు ప్రత్యేక కేటాయింపులు ఏమి జరగపోవడం నిరాశ కలిగించింది. – మెదక్‌జోన్‌

ందిరమ్మ బీమా పథకాన్ని బడ్జెట్‌లో కొత్తగా ప్రవేశపెట్టారు. కుటుంబ యజమాని ఏదేని కా రణంతో మరణిస్తే ఈ పథకం ద్వారా రూ. 5 లక్షల బీమా వర్తించనుంది. దీంతో జిల్లాలో 1,68,365 కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. అలాగే ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియెట్‌ వరకు చదివే విద్యార్థులకు వారంలో 3 రోజులు పాలు, మరో 3 రో జుల పాటు రాగిజావ అందించనున్నారు. జిల్లావ్యాప్తంగా 75,263 మంది విద్యార్థులు ఈపథకం ద్వారా మేలు చేకూరనుంది. ఇంటర్‌ విద్యార్థులకు సైతం మధ్యాహ్న భోజనం అందించనున్నారు. జిల్లాలోని 16 ప్రభుత్వ కళాశాలల్లో చదువుకునే 6,585 మంది విద్యార్థులకు లబ్ధి జరగనుంది. అంతేకాకుండా దివ్యాంగ విద్యార్థులకు ద్విచక్ర వాహనాలు అందనున్నాయి.

కొత్త పెన్షన్లకు మోక్షం

న్నో ఏళ్లుగా చేయూత పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. కొత్త పెన్షన్లకు బడ్జెట్‌లో నిధులు కేటాయించింది. దీంతో జిల్లాలో ఇప్పటివరకు 1,200 మంది ఆన్‌లైన్‌, మరో 6 వేల పైచిలుకు మంది ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. వీరికి త్వరలో కొత్త పింఛన్లు అందనున్నాయి. అలాగే రాజీవ్‌ యువ వికాసం కోసం బడ్జెట్‌లో రూ. 6 వేల కోట్లు కేటా యించారు. జిల్లాలో నిరుద్యోగ యువత సుమారు 19 వేల పైచిలుకు ఉన్నట్లు తెలిసింది. వారందరికీ ఈ పథకం ద్వారా ఉపాధి లభించనుంది. అలాగే అడ్వాన్స్‌ టెక్నాలజీ (ఏటీసీ) సెంటర్లలో శిక్షణ పొందుతున్న నిరుద్యోగులకు నెలకు రూ. 2 వేల చొప్పున స్కాలర్‌షిప్‌ అందిస్తామని చెప్పడంతో, జిల్లాలో 170 మందికి మేలు జరగనుంది. పెట్రోల్‌, డీజిల్‌తో నడిచే ఆటోలను ప్రభుత్వ ఖర్చుతో ఎలక్ట్రానిక్‌ వాహనాలుగా మారుస్తామన్నారు. జిల్లాలో 10,734 ఆటోవాలాలు ఉన్నారు.

సన్నాలకు నిధులు..

లాగే సన్న ధాన్యానికి బడ్జెట్‌లో రూ. 3,500 కోట్ల నిధులు కేటాయించారు. జిల్లాలో గత యాసంగిలో 40 వేల ఎకరాల్లో రైతులు సన్నాలు సాగు చేయగా, రూ.31.37 కోట్ల బకాయిలు నేటికీ చెల్లించలేదు. ప్రస్తుతం రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. అలాగే ఉద్యోగులకు, పెన్షన్‌దారులకు నగదు రహిత వైద్యం అందించనున్నారు. ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.1.20 కోట్ల బీమా ఇస్తామని ప్రకటించారు. జిల్లాలో 5 వేల పైచిలుకు ఉద్యోగులు, పెన్షన్‌దారులు ఉన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో చదువుకునే చిన్నారులకు ఏడాదికి రెండు జతల యూనిఫాంలు ఇవ్వనున్నారు. జిల్లాలో 25,245 మంది చిన్నారులు చదువుకుంటున్నారు. అలాగే రైతు భరోసా కింద జిల్లాలోని 2.62 లక్షల మంది రైతులకు సుమారు రూ.220 కోట్ల పెట్టుబడి సాయం అందనుంది.

ఈ‘సారీ’ నిరాశే

మెతుకుసీమలో ఏకై క మధ్యతరహా ప్రాజెక్టు ఘనపూర్‌ స్థిరాయకట్టు కేవలం 25 వేల ఎకరాలు మాత్రమే. దాని ఎత్తు పెంపు కోసం చాలా కాలంగా రైతులు ఎదురుచూస్తుండగా, ఈసారి నిరాశే మిగిలింది. అలాగే కాళేశ్వరం కెనాళ్ల పనులకు నిధులు కేటాయించలేదు. మెదక్‌ బైపాస్‌ రోడ్డు ప్రస్తావనకు రాలేదు.

బడ్జెట్‌లో అన్ని రంగాలకుకేటాయింపులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement