పెండింగ్ మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులకు మోక్షం
మెదక్ అర్బన్: మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లుల మంజూరులో అవినీతికి, అలసత్వానికి పాల్పడిన సర్వజన ఆస్పత్రి కార్యాలయ సూపరింటెండెంట్ లతీఫొద్దీన్ ముజాహిద్దీన్‌ను తదుపరి చర్యల నిమిత్తం రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ సంచాలకుడు సరెండర్ చేసినట్లు మెదక్ సూపరింటెండెంట్ సునీత తెలిపారు. మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లుల మంజూరులో ముజాహిద్దీన్‌పై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాలకు జిల్లా అధికారులు స్పందించారు. ఈనెల 13న ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించి, రికార్డులు పరిశీలించారు. అనంతరం సంబంధిత డిపార్డ్‌మెంట్‌కు నివేదిక అందజేసేందుకు అవసరమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈలోగా సూపరింటెండెంట్ కార్యాలయం ఒక అంతర్గత కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేపట్టింది. అతడిపై వచ్చిన ఆరోపణలు, ప్రవర్తన, ఫైళ్ల పరిష్కారంలో జాప్యం, తీవ్రమైన అక్రమాలను గుర్తించింది. ఈమేరకు ముజాహిద్దీన్‌ను సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పెండింగ్ ఫైళ్లను సైత్తం క్లియర్ చేశారు.


