మెదక్ కలెక్టరేట్: రంజాన్‌ను పురస్కరించుకుని నవాబ్‌పేట్‌లోని ఈద్గా వద్ద ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను అదనపు ఎస్పీ మహేందర్ శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. ఈసందర్భంగా ఈద్గా పరిసరాల్లో భద్రతా చర్యలు, పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సూచనలు ఇచ్చారు. జిల్లా కేంద్ర పరిధిలోని మసీదుల వద్ద పటిష్ట భద్రత కల్పించినట్లు తెలిపారు. ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రధాన రహదారులు, చౌరస్తాల్లో ప్రత్యేక పోలీస్ పికెట్స్ ఏర్పాటు చేసి, రద్దీ ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని మోహరించినట్లు వివరించారు. పండుగ రోజుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతర పెట్రోలింగ్ కొనసాగిస్తామన్నారు. ముస్లింలు పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని కోరారు. ఆయన వెంట డీఎస్పీ ప్రసన్నకుమార్, పట్టణ సీఐ మహేష్, సిబ్బంది ఉన్నారు.
అదనపు ఎస్పీ మహేందర్


