యువత జోరు | - | Sakshi
Sakshi News home page

యువత జోరు

Dec 9 2025 10:37 AM | Updated on Dec 9 2025 10:37 AM

యువత

యువత జోరు

‘స్థానిక’ంగా సత్తా చాటేందుకు పోరు ‘పంచాయతీ’ బరిలో విద్యావంతులే అధికం

నర్సాపూర్‌ రూరల్‌: "ç³ÌñæÏ-ÌS¯]l$ °Æý‡Ï„ýSÅ… ^ólÄñæ¬ §ýl$ª. {V>Ð]l*-ÌZϯól Ð]l$¯]l-§ólÔèæ B™èlà E…¨. E¯]l²™èl ѧýlÅ ™ø ç³rt×ê-ÌS¯]l$ B{ÔèæÆ‡$$çÜ$¢-¯é²Æý‡$. AÐ]l-M>Ôèæ… Ð]l_-a-¯]l-糚yýl$ {V>Ð]l$ õÜÐ]l¯]l$ Ð]l§ýl-ÌŸ§ýl$ª' A¯]l² Ð]l$à™èlÃ-V>…-«© Ð]l*rÌS¯]l$ A„ýSÆ>ÌS °f… ^ólçÜ$¢-¯é²Æý‡$ Ð]l$…yýl-ÌS…ÌZ° ѧéÅ-Ð]l…-™èl$Ë$. Kr$ ÐólĶæ$-yé-°MìS ™èlç³µ, ´ùsîæMìS Ķæ¬Ð]l™èl Ð]l¬…§ýl$-Mö-_a¯]l §éQ-ÌêË$ ™èlMýS$PÐ]l. AƇ$$™ól VýS™é-°MìS À¯]l²…V> DÝëÇ Ð]l¬…§ýl$-Mö-^éaÆý‡$. yìl{XË$ ç³NÇ¢ ^ólíܯ]l ÐéÆý‡$ Mö…§ýl-OÆð‡™ól.. BĶæ* {Oò³ÐólsŒæ çÜ…çܦÌZÏ E§øÅVýS… ^ólçÜ$¢¯]l² Ð]l$Ç-Mö…™èl Ð]l$…¨ çÜÆý‡µ…-^ŒlV> G°²MýSÌS ºÇÌZ °Í-^éÆý‡$. Cç³µ-sìæMóS ¯]lÆ>Þç³NÆŠḥ Ð]l$…yýl-ÌS…ÌZ çÜ$Ð]l*Æý‡$ 20 Ð]l$…¨MìS Oò³V> ѧéÅ-Ð]l…-™èl$Ë$ {ç³^éÆý‡…ÌZ §ýl*çÜ$-MðS-â¶æ$¢-¯é²Æý‡$.

● నర్సాపూర్‌ మండలం మంతుర్‌ గ్రామానికి చెందిన మల్దొడ్డి వెంకన్న బీటెక్‌ మెకానికల్‌ పూర్తి చేశాడు. విదేశాలకు వెళ్లాలని అనుకున్న క్రమంలో ఓ ప్రైవేట్‌ కంపెనీలో కన్సల్టెంట్‌గా ఉద్యోగం లభించింది. అయితే అందులో సంతృప్తి లేకపోవడంతో గత ఎన్నికల్లో తన భార్యను సర్పంచ్‌గా పోటీ చేయించి గ్రామానికి సేవ చేశారు. ప్రస్తుతం జనరల్‌కు రిజర్వ్‌ కావడంతో నామినేషన్‌ వేసి బరిలో నిలిచారు.

● జక్కపల్లి సర్పంచ్‌ అభ్యర్థిగా బీటెక్‌ కంప్యూటర్‌ పూర్తి చేసిన దుప్తల భారత్‌ నామినేషన్‌ వేశారు. తండ్రి మృతితో ఉద్యోగంలో చేరకుండా రాజకీయాల్లోకి వచ్చాడు. తల్లిదండ్రులు ఇద్దరు గతంలో చిప్పల్‌తుర్తి సర్పంచ్‌గా సేవలందించడంతో వారిని స్ఫూర్తిగా తీసుకున్నాడు. సర్పంచ్‌గా గెలుపొంది గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని చెబుతున్నాడు.

● ఇబ్రహీంబాద్‌ సర్పంచ్‌ అభ్యర్థిగా ఎంఏ ఎకనామిక్స్‌ చదివిన దాడిగా నరేశ్‌ బరిలో నిలిచారు. ప్రజలు అవకాశం ఇస్తే గ్రామాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానని అంటున్నాడు. యువతకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తానని చెబుతున్నాడు.

● అహ్మద్‌నగర్‌ సర్పంచ్‌ అభ్యర్థిగా బీటెక్‌ పూర్తి చేసిన వెంకట్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. గ్రామం ప్రగతికి నోచుకోలేదని, సర్పంచ్‌గా గెలిచి అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఉద్యోగానికి రాజీనామా చేసి మరి పోటీ చేస్తున్నాడు.

● మాడాపూర్‌ ఎస్టీ మహిళకు రిజర్వుడు కావడంతో డిప్లొమా, జనరల్‌ నర్సింగ్‌ పూర్తి చేసిన రమావత్‌ సునీత పోటీ చేస్తున్నారు. తండా పెద్దలు, తన భర్త ప్రోత్సాహంతో ఉద్యోగానికి రాజీనామా చేసి సర్పంచ్‌ బరిలో నిలిచారు.

● బ్రాహ్మణపల్లి స్థానానికి బీకాం కంప్యూటర్స్‌ పూర్తి చేసిన కొల్చల్మ ఆనంద్‌ పోటీ చేస్తున్నారు. గతంలో తన తల్లి ఎంపీటీసీగా గెలిచినప్పటికీ, నిధులు లేక గ్రామాన్ని అభివృద్ధి చేయలేకపోయారని, సర్పంచ్‌కు నిధులు ఉండడంతో గెలుపొంది అభివృద్ధి చేస్తానని చెబుతున్నాడు.

● తుజాల్‌పూర్‌ బరిలో డిగ్రీ పూర్తి చేసిన కొర్ర జ్యోతి నిలిచారు. గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశంతో పోటీ చేస్తున్నానని పేర్కొన్నారు.

యువత జోరు1
1/7

యువత జోరు

యువత జోరు2
2/7

యువత జోరు

యువత జోరు3
3/7

యువత జోరు

యువత జోరు4
4/7

యువత జోరు

యువత జోరు5
5/7

యువత జోరు

యువత జోరు6
6/7

యువత జోరు

యువత జోరు7
7/7

యువత జోరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement