ఎన్నికలు సజావుగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

ఎన్నికలు సజావుగా నిర్వహించాలి

Dec 3 2025 9:41 AM | Updated on Dec 3 2025 9:41 AM

ఎన్ని

ఎన్నికలు సజావుగా నిర్వహించాలి

ఎన్నికలు సజావుగా నిర్వహించాలి వేసెక్టమి ఆపరేషన్లకు ముందుకురావాలి కొత్త ఖాతా అవసరమే, కానీ.. మహాసభలను జయప్రదం చేయండి

జెడ్పీ సీఈఓ ఎల్లయ్య

వెల్దుర్తి(తూప్రాన్‌): పంచాయతీ ఎన్నికలో ఎలాంటి తప్పిదాలకు అవకాశం లేకుండా నిర్వహించాలని జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, తూప్రాన్‌ ఆర్డీఓ జయచంద్రారెడ్డి అన్నారు. మాసాయిపేట, వెల్దుర్తి మండల కేంద్రాల్లో బుధవారం నుంచి ప్రారంభం కానున్న నామినేషన్‌ ప్రక్రియ ఏర్పాట్లను వారు వేర్వేరుగా పరిశీలించారు.ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించడంలో అధికారులు, సిబ్బంది క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని, పరస్పరం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో మండల ఎన్నికల అధికారులు ఉమాదేవి, విఘ్నేశ్వర్‌, తహసీల్దార్‌లు శ్రీనివాస్‌, జ్ఙానజ్యోతి, ఆర్‌ఓలు, ఏఆర్‌ఓలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ వసంత్‌రావు

జహీరాబాద్‌ టౌన్‌: వేసెక్టమి ఆపరేషన్లకు పురుషులు ముందుకురావాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ వసంత్‌రావు అన్నారు. జహీరాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం నిర్వహించిన వేసెక్టమి క్యాంపును సందర్శించారు. ఆపరేషన్‌ చేసుకున్న వారికి సర్టిఫికెట్‌లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పురుషులకు కోత, కుట్టు లేకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తున్నట్లు చెప్పారు. ఎలాంటి ముప్పు ఉండదని, ఐదు నిమిషాల్లో ఆపరేషన్‌ పూర్తవుతుందని చెప్పారు. దాంపత్య జీవితానికి ఎలాంటి ఆటంకం కలగదని, అపోహలు నమ్మకుండా వేసెక్టమి ఆపరేషన్లు చేసుకునేందుకు ముందుకురావాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ లక్ష్మిశైలజ, ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ మనోహర్‌రెడ్డి, డాక్టర్‌ నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆర్డీఓ మహిపాల్‌

నర్సాపూర్‌: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు బ్యాంకు కొత్త ఖాతా అవసరమేనని, అయితే.. నామినేషన్‌ వేసే సమయానికి ఖాతా తెరవక పోయినా నామినేషన్లను అమోదిస్తామని నర్సాపూర్‌ ఆర్‌డీఓ, జిల్లా డిప్యూటీ ఎన్నికల అధికారి మహిపాల్‌ చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు జిల్లాలోని ఏదైనా బ్యాంకు లేదా పోస్టాఫీసులో కరెంటు అకౌంట్‌ తెరిచి ఆ నంబరును ఎన్నికల అధికారులకు ఇవ్వాలన్నారు. పలు రకాల కారణాలతో నామినేషన్‌ వేసే సమయానికి ఖాతా తెరువక పోయినా నామినేషన్‌ను ఆమోదిస్తామన్నారు. అభ్యర్థులు కొత్తగా తెరిచిన బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు డ్రా చేసి ఎన్నికల్లో ఖర్చు చేయాల్సి ఉంటుందని, ఎన్నికల ఖర్చు వివరాలను ఎన్నికల అధికారులకు ఎన్నికల ఫలితాలు వచ్చిన 45 రోజుల్లోపు అందజేయాల్సి ఉంటుందని వివరించారు. లేకుంటే ఎన్నికల సంఘం తీసుకునే చర్యలకు బాధ్యులవుతారని ఆయన హెచ్చరించారు.

సీఐటీయూ సహాయ కార్యదర్శి సంతోష్‌

మెదక్‌ కలెక్టరేట్‌: ఈనెల 7, 8, 9వ తేదీల్లో మెదక్‌లో జరిగే సీఐటీయూ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంస్థ జిల్లా సహాయ కార్యదర్శి సంతోష్‌ తెలిపారు. మంగళవారం మెదక్‌లో కరప్రతాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంతోష్‌ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాలుగు లేబర్‌కోడ్‌లు తెచ్చి కార్మికులు సాధించుకున్న హక్కులను కాలరాసే కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. ఈ మహాసభల్లో కార్మికుల సమస్యలపై భవిష్యత్‌ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. జిల్లాలోని కార్మికులంతా పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలోఆశ వర్కర్లు పాల్గొన్నారు.

ఎన్నికలు సజావుగా  నిర్వహించాలి
1
1/2

ఎన్నికలు సజావుగా నిర్వహించాలి

ఎన్నికలు సజావుగా  నిర్వహించాలి
2
2/2

ఎన్నికలు సజావుగా నిర్వహించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement