సర్పంచ్‌కి సగటున నలుగురు
● వార్డు మెంబర్‌కు ఇద్దరు
● మొదటి విడత నామినేషన్ల పరిశీలన పూర్తి
మెదక్ అర్బన్: మొదటి విడత పంచాయతీ పోరులో సర్పంచ్ పదవికి సగటున నలుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వార్డు మెంబర్లకు వచ్చేసరికి, ఒక్క వార్డుకు ఇద్దరి చొప్పుప నామినేషన్లు వేశారు. జిల్లాలో మొదటి విడతగా అల్లాదుర్గం, హవేళిఘణాపూర్, పాపన్నపేట, రేగోడ్, శంకరంపేట(ఏ), టేక్మాల్ మండలాలకు ఈనెల 11న ఎన్నికలు జరుగనున్నాయి. కాగా ఆరు మండలాల్లో 160 గ్రామ పంచాయతీలు ఉండగా, 1,400 వార్డులు ఉన్నాయి. అయితే నామినేషన్ల పరిశీలన ముగిసే నాటికి 160 సర్పంచ్‌లకు గాను 678, 1,400 వార్డులకు 2,821 నామినేషన్లు దాఖలు అయ్యాయి. పరిశీలనలో 2 వార్డు మెంబర్ నామినేషన్లు తిరస్కరించారు. అత్యధికంగా పాపన్నపపేట మండలంలో 40 పంచాయతీలు ఉండగా 184, అల్లాదుర్గ్‌లో 16 పంచాయతీలకు 77 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈనెల 3 వరకు నామినేషన్ ఉపసంహరణకు గడువు ఉండటంతో, ఒకే పార్టీలోని అభ్యర్థులను ఉపసంహరింపజేయడానికి పార్టీ నాయకులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
»


