బీసీలకు తగ్గాయ్!
గతంతో పోలిస్తే తగ్గిన స్థానాలు
‘స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఈఏడాది సెప్టెంబర్‌లో ప్రభుత్వం గెజిట్ విడుదల చేయగా, రేగోడ్ మండలం ప్యారారం పంచాయతీ బీసీకి రిజర్వ్‌డ్ అయింది. హైకోర్టు అభ్యంతరం చెప్పడంతో పాత రిజర్వేషన్ అమలు చేయగా, ప్రస్తుతం అన్‌రిజర్వ్‌డ్ (యూఆర్) కేటాయించారు. ప్రస్తుతం ఆ గ్రామంలోని ఓసీలు పోటీకి సిద్ధం అయ్యారు. ఇలాంటి గ్రామాలు జిల్లాలో పదుల సంఖ్యలో ఉన్నాయి’.
మెదక్‌జోన్: జిల్లాలో 492 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 71 గ్రామాలు వందశాతం (ఎస్టీ) గిరిజనులు ఉండటంతో వాటిని ఎస్టీలకే కేటా యించగా, మిగితా 421 గ్రామాలను వివిధ వ ర్గాలకు రిజర్వేషన్ల వారీగా కేటాయించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ప్రకారం 176 సీట్లు లభించాయి. హైకోర్టు అభ్యంతరం చెప్పటంతో పాత రిజర్వేషన్ ప్రకారం ప్రస్తుతం బీసీలకు దక్కిన రిజర్వేషన్లను అన్ రిజర్వ్‌డ్‌కు కేటాయించారు. దీంతో జిల్లాలో జనరల్ సీట్ల సంఖ్య ఏకంగా 215కు పెరిగింది. 2011 జనాభా ప్రాతిపదికన పాత పద్ధతిని అవలంభిస్తూ బీసీలకు 25.65 శాతం రిజర్వేషన్ ప్రకారం ప్రస్తుతం 108 సీట్లు మాత్రమే వర్తించాయి. కాగా 2019లో జరిగిన ఎన్నికల్లోనూ బీసీలకు 29 శాతం రిజర్వేషన్ కేటాయించగా, 120 సీట్లు దక్కాయి. గతంతో పోలిస్తే బీసీలకు ప్రస్తుతం 3.35 శాతం రిజర్వేషన్ తగ్గటంతో 12 స్థానాలు తగ్గాయి.
పార్టీపరంగా ప్రాధాన్యం ఏదీ?
స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల 50 శాతం మించరాదని హైకోర్టు పేర్కొనడంతో యూ టర్న్ తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం, కోర్టులు అడ్డుచెప్పినా తామూ పార్టీపరంగా బీసీలకు 42 శాతం సీట్లు కేటాయిస్తామని చెప్పారు. కాగా మొదటి విడత నామినేషన్ల పర్వం ప్రారంభం అయినప్పటికీ బీసీల ప్రస్తావన ఎక్కడా రావ డం లేదు. గ్రామాలకు కేటాయించిన రిజర్వేషన్ల ప్రకారం ఆయావర్గాల వారు నామినేషన్లు వేస్తున్నారు.
ఆ స్థానాల్లో పోటీకి బీసీలు నిరాకరణ
బీసీలకు 25.65 శాతం రిజర్వేషన్ ప్రకారం 108 స్థానాలు, ఎస్సీలకు 77 శాతం కేటాయించారు. మిగితా 215 స్థానాలను అన్‌రిజర్వ్‌డ్(యూఆర్)కు కేటాయించటంతో జనరల్ స్థానాల్లో ఓసీలే పోటీకి సిద్ధమయ్యారు. ఆ స్థానాల్లో బీసీ లు పోటీచేసేందుకు జంకుతున్నారు. ఎందుకంటే వారు మొదటి నుంచి ఆర్థికంగా, రాజకీయంగా ఆరితేరిన వారు ఉండటంతో గెలవటం సాధ్యం కాదనే భావన బీసీల్లో ఉంది.
ఒక్కరమే పోటీలో నిలుద్దాం
చిన్నశంకరంపేట(మెదక్): ‘స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనేందుకు మనం ఒక్కటవుదాం.. ఒక్కరమే పోటీలో నిలుద్దాం’ అంటూ పల్లెల్లో కుల సంఘాలు ఐక్యతారాగం వినిపిస్తున్నాయి. మన కులం నుంచి ఒకరిని మాత్రమే పోటీలో నిలిపి గెలిపించుకుందాం అంటూ కొత్త నినా దం ఎత్తుకున్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో బలమైన వర్గంగా ఉన్న ముదిరాజ్ లు పోటీదారులను గుర్తించి ఒక్కతాటిపైకి తీసు కొచ్చేందుకు చర్చలు జరుపుతున్నారు. మూడు రోజుల క్రితం జరిపిన చర్చలలో 9 మంది అభ్యర్థులు సర్పంచ్ బరిలో ఉంటామని ముందుకు రాగా, గురువారం ఉదయం నుంచి జరిగిన సమావేశంలో ఆ సంఖ్య ముగ్గరికి వచ్చి ంది. నామినేషన్లు వేసేందుకు మరో మూడు రోజుల గడువు మాత్రమే ఉందని, అప్పటిలోగా ఒకరిని మాత్రమే పోటీలో నిలుపుతామని ముదిరాజ్ సంఘం పెద్దలు తెలిపారు. ఇప్పటికే చిన్నశంకరంపేట మేజర్ పంచాయతీలోని కుర్మ పల్లిలో యాదవ సంఘం సభ్యులు ఒక్కతాటిపైకి వచ్చారు. 12వ వార్డుకు చెందిన పుల్ల ఎల్లం భార్య కనకవ్వను పోటీలో దించేందుకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ వా ర్డులో ఒక వర్గం ఓట్లు 80 శాతం కావడంతో ఇతరులు పోటీకి రారని భావిస్తున్నారు. 4వ వార్డులో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉంటారు, రెండు రోజులుగా చర్చలు జరిపి జాకీర్ అనే యువకుడిని బరిలో నిలిపేందుకు తీర్మానించారు.
బీసీలకు తగ్గాయ్!


