తొలిరోజు 59 నామినేషన్లు
న్యూస్‌రీల్
వడ్డీలేని రుణాలు.. మాకేవి?పట్టణాల్లోని మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు మంజూరు చేయకపోవడంతో నిరాశ చెందుతున్నారు. వివరాలు 8లో u
సర్పంచ్‌కు 55, వార్డు స్థానాలకు 4 దాఖలు
మెదక్‌కలెక్టరేట్: గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొదటిరోజు 55 సర్పంచ్, 4 వార్డు సభ్యుల నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. గురువారం రాత్రి నామినేషన్ల వివరాలు వెల్లడించారు. అల్లాదుర్గం మండలంలో సర్పంచ్‌కు 5, రేగోడ్‌లో 7, పెద్దశంకరంపేటలో 8, టేక్మాల్‌లో సర్పంచ్ 5, వార్డు సభ్యులు 1, పాపన్నపేట మండలంలో సర్పంచ్ 15, హవేళిఘణాపూర్‌లో సర్పంచ్ 16, వార్డు సభ్యులు 3 చొప్పున నామినేషన్లు దాఖలైనట్లు తెలిపారు. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణకు ఈనెల 29వ తేదీ సాయంత్రం 5 గంటల వర కు సమయం ఉందని తెలిపారు. అభ్యర్థులు ఎన్నికల నిబంధనలను పా టిస్తూ నిర్ణీత సమయంలో నామినేషన్లు దాఖలు చేసేందుకు అన్ని రిటర్నింగ్ కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎన్నికలు ప్రక్రియ పర్యవేక్షణకు నోడల్ అధికారులు పటిష్ట పర్యవేక్షణ చేయాలన్నారు. ఫిర్యాదులకు 24 గంటలు పని చేసే విధంగా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం 9391942254 నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు.


