విజయమే లక్ష్యంగా పనిచేయాలి
హత్నూర( సంగారెడ్డి): పంచాయతీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి కార్యకర్తలకు సూచించారు. గురువారం హత్నూర మండలం మంగాపూర్‌లో జరిగిన పార్టీ ముఖ్యనేతల సమావేశంలో ఆమె మాట్లాడారు. పా ర్టీ నేతలు, కార్యకర్తల మధ్య సమన్వయం మరింత పెరగాలని, విభేదాలు పక్కన పెట్టి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలన్నారు. సమష్టి కృషితోనే ఇది సాధ్యమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో పల్లెలు అభివృద్ధికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్ అభ్యర్థుల విషయమై గ్రామాల వారీగా నాయకులు, కార్యకర్తల సమక్షంలోనే చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని సునీతా రెడ్డి సూచించారు. సమావేశంలో కార్మిక సంక్షేమ బోర్డు మాజీ చైర్మన్ దేవేందర్ రెడ్డి, పార్టీ మండల శాఖ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, మాజీ ఎంపీపీ నర్సింహులు, మాజీ జెడ్పీటీసీ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
కార్యకర్తలకు ఎమ్మెల్యే సునీతారెడ్డి ఉద్బోధ


