కొత్త బ్యాంకు అకౌంట్‌ తప్పనిసరి: ఆర్డీఓ | - | Sakshi
Sakshi News home page

కొత్త బ్యాంకు అకౌంట్‌ తప్పనిసరి: ఆర్డీఓ

Nov 28 2025 11:39 AM | Updated on Nov 28 2025 11:45 AM

కొత్త

కొత్త బ్యాంకు అకౌంట్‌ తప్పనిసరి: ఆర్డీఓ

తూప్రాన్‌: సర్పంచ్‌, వార్డు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా నూతన బ్యాంకు అకౌంట్‌ లే దా పోస్టాఫీస్‌ అకౌంట్‌ను తమ నా మినేషన్‌ పత్రంతో పాటు సమర్పించాలని ఆర్డీఓ జయచంద్రారెడ్డి సూచించారు. గురు వారం ఆయన మాట్లాడుతూ.. తూప్రాన్‌ డివిజన్‌ పరిధిలోని తూప్రాన్‌, మనోహరాబాద్‌, చేగుంట, నార్సింగి మండలాల్లోని అన్ని గ్రామ పంచాయతీలు, వార్డు స్థానాలకు ఈనెల 30 నుంచి నామినేషన్లను ఆయా ఎంపీడీఓ కా ర్యాలయంలో స్వీకరిస్తారని తెలిపారు. వెల్దుర్తి, మాసాయిపేట మండలాలు మూడో విడతలో ఉన్న నేపథ్యంలో ఈ ఆదివారం ఆ మండలాల్లో నామినేషన్ల స్వీకరణ ఉండదని తెలిపారు. నామినేషన్‌ వేయడానికి ఆది, సోమ, మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే అవకాశం ఉంటుందన్నారు.

పోస్టల్‌ బ్యాలెట్‌

అవకాశం కల్పించండి

మెదక్‌కలెక్టరేట్‌: తమకు పోస్టల్‌ బ్యాలెట్‌ అవకాశం కల్పించాలని కోరుతూ పంచాయతీ కార్యదర్శులు, కంప్యూటర్‌ ఆపరేటర్లు గురువారం డీపీఓ యాదయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. తాము ఎన్నికల విధుల్లో ఉన్నందున ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లేకుండా పోతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు ఫోరం జిల్లా అధ్యక్షుడు జంగం నగేశ్‌కుమార్‌, ప్రచార కార్యదర్శి ముత్యాల నర్సింలు, ప్రభాకర్‌, మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

న్యాయవాదుల

రక్షణ చట్టం తేవాలి

మెదక్‌జోన్‌: న్యాయవాదుల కోసం రక్షణ చట్టం అమలు చేయాలని సీనియర్‌ అడ్వకేట్‌ రాపోలు భాస్కర్‌ డిమాండ్‌ చేశారు. గురువారం జిల్లా కోర్టులో న్యాయవాదులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ బార్‌ కౌన్సిల్‌ సభ్యుడిగా పోటీలో ఉన్న తనను గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో న్యాయవాదులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, వారి సంక్షేమం, ఆర్థిక భద్రత కోసం నెలకు రూ. 5 నుంచి రూ. 10 వేల వరకు స్టైఫండ్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈవిషయంపై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానన్నారు. సమావేశంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రాములు, సీనియర్‌ న్యాయవాది పోచయ్య, సుభాశ్‌గౌడ్‌, రవీందర్‌, జనార్దన్‌రెడ్డి, రాఘవులు, శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ బడుల్లోనే

మెరుగైన విద్య: డీఈఓ

మెదక్‌ కలెక్టరేట్‌: ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందుతుందని డీఈఓ విజయ అన్నారు. గురువారం మెదక్‌ పట్టణంలోని గాంధీనగర్‌ ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. ఈసందర్భంగా పాఠశాలలోని విద్యార్థులతో మాట్లాడి వారి పఠనా సామర్థ్యాలను తెలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థులకు పాఠ్య, నోట్‌ పుస్తకాలను అందించనున్నట్లు తెలిపారు. ప్రైవేట్‌ పాఠశాలల కంటే మెరుగైన బోధన అందిస్తున్నామన్నారు. జిల్లాలో విద్యా ప్రమాణా లు పెంచడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. అనంతరం విద్యార్థులతో మా ట్లాడారు. సెల్‌ఫోన్‌ వాడకం, టీవి చూడటం తగ్గించి చదువుపై దృష్టి సారించాలని సూచించారు. అనంతరం ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు.

కొత్త బ్యాంకు అకౌంట్‌ తప్పనిసరి: ఆర్డీఓ 
1
1/2

కొత్త బ్యాంకు అకౌంట్‌ తప్పనిసరి: ఆర్డీఓ

కొత్త బ్యాంకు అకౌంట్‌ తప్పనిసరి: ఆర్డీఓ 
2
2/2

కొత్త బ్యాంకు అకౌంట్‌ తప్పనిసరి: ఆర్డీఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement