49 షాపులు.. 1,350 దరఖాస్తులు | - | Sakshi
Sakshi News home page

49 షాపులు.. 1,350 దరఖాస్తులు

Oct 19 2025 8:28 AM | Updated on Oct 19 2025 8:28 AM

49 షాపులు.. 1,350 దరఖాస్తులు

49 షాపులు.. 1,350 దరఖాస్తులు

మెదక్‌జోన్‌: జిల్లాలో మద్యం షాపుల కేటాయింపు కోసం ఎకై ్సజ్‌శాఖ నిర్వహించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. ఈసారి దరఖాస్తుల సంఖ్య తగ్గింది. జిల్లాలోని 49 మద్యం షాపులకు శనివారం రాత్రి వరకు అప్లికేషన్లు తీసుకున్నారు. రాత్రి 10 గంటల వరకు 1,350 దరఖాస్తులు వచ్చినట్లు ఈఎస్‌ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. గతంతో పోల్చితే ఈసారి దరఖాస్తుల సంఖ్య తగ్గింది. 2023లో 1,905 దరఖాస్తులు, రూ. 38.10 కోట్ల ఆదాయం రాగా, ఈసారి పెరిగిన దరఖాస్తు ఫీజుతో రూ. 40.5 కోట్ల ఆదాయం వచ్చింది. రూ. 2.5 కోట్లు అదనంగా ఎకై ్సజ్‌శాఖకు సమకూరింది. ఆఖరు రోజు శనివారం రాత్రి 10 గంటల వరకు 517 దరఖాస్తులు రావటం గమనార్హం. ఈ నెల 23న కలెక్టరేట్‌లో లక్కీ డ్రా తీసి షాపులు కేటాయించనున్నారు.

రూ.3 లక్షలకు పెంచడమే కారణమా!

ప్రభుత్వం ఈసారి మద్యం షాపుల దరఖాస్తు ఫీజును భారీగా పెంచింది. 2023లో రూ. రెండు లక్షలు ఉన్న ఈ ఫీజును ఈసారి ఏకంగా రూ.3 లక్షలకు పెంచింది. దీంతో మద్యం వ్యాపారులు ఆచితూచి దరఖాస్తులు చేసుకున్నారు. గతంలో ఒక్కో షాపునకు ఆరు ఏడు దరఖాస్తులు చేసుకున్న సిండికేట్‌ వ్యాపారులు ఈసారి నాలుగైదుతో సరిపెడుతున్నారు.

గతంతో పోలిస్తే 555 తక్కువ

పెరిగిన ధరతో రూ. 2 కోట్లు అదనం

మద్యం షాపులకు ముగిసిన

అప్లికేషన్ల ప్రక్రియ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement