
క్రీడలతో స్నేహభావం: డీఎం సురేఖ
మెదక్ కలెక్టరేట్: మెదక్ జిల్లా కేంద్రంలోని ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో శుక్రవారం జిల్లాస్థాయి అండర్ 17, అండర్ 14 బాలికల ఖోఖో పోటీలు అట్టహాసంగా జరిగాయి. ఎస్‌జిఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ జిల్లాస్థాయి పోటీల్లో 21 మండలాల నుంచి 420 మంది బాలికలు పాల్గొన్నారు. సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమానికి ఆర్టీసీ డిపో మేనేజర్ సురేఖ హాజరై విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడలతో స్నేహభావం పెంపొందిచుకోవచ్చన్నారు. ఈ పోటీల్లో అండర్ 17 విభాగంలో హవేళిఘనాపూర్ జట్టు మొదటి బహుమతి, , పాపన్నపేట ద్వితీయ బహుమతి, రామాయంపేట తృతీయ బహుమతి అండర్–14విభాగంలో ఫస్ట్ ఫ్రైజ్ పాపన్నపేట, సెకండ్ ఫ్రైజ్ మెదక్, థర్డ్‌ఫ్రైజ్ చేగుంట జట్లు సాధించాయి. ఈ కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్ కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ ఈ పోటీల్లో గెలుపొందిన జట్లు ఈనెల చివరి వారంలో మెదక్‌లో జరిగే ఉమ్మడి మెదక్ జిల్లా ఖో ఖో పోటీలలో పాల్గొంటాయని తెలిపారు.
జిల్లాస్థాయి బాలికల
ఖోఖో పోటీలు ప్రారంభం
విజేతలకు బహుమతులు అందజేసిన
డీఎం సురేఖ