
చెల్లిస్తామనడం సంతోషం
వడ్లు తూకం చేసిన 48 గంటల్లోనే మద్దతు ధరతో పాటు సన్న వడ్లకు బోనస్ చెల్లిస్తామని ప్రకటించడం సంతోషం. ఈసారి భారీ వానలతో, పొంగి పొర్లిన వరదలతో అనేక చోట్ల పంటలు దెబ్బ తిన్నాయి. రైతులు అనేక విధాలుగా నష్టపోయారు. కనీసం బోనస్ డబ్బులు ఇస్తే సకాలంలో అప్పులు తీర్చగలం.
– పోచయ్య, రైతు పాపన్నపేట
బకాయిలూ చెల్లించండి
గత యాసంగికి సంబంధించి సన్న వడ్లకు బోనస్ ఇంత వరకు రాలేదు. సుమారు రూ.40 వేలు రావాలి. బకాయీల చెల్లింపుపై నిర్ణయం తీసుకోక పోవడం శోచనీయం. ప్రభుత్వాన్ని నమ్మి, బోనస్ ఆశకు చాలా మంది రైతులు సన్న వరి వేశారు. రైతులను ఇబ్బంది పెట్టడం తగదు.
– మహిపాల్, రైతు, పాపన్నపేట

చెల్లిస్తామనడం సంతోషం