
పత్రికా స్వేచ్ఛను హరించడమే..
మెదక్‌జోన్: నకిలీ మద్యంపై కథనాలు ప్రచురించిన సాక్షి విలేకరులతో పాటు ఎడిటర్ ధనంజయరెడ్డిపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం చర్యలను జర్నలిస్టులు ఖండించారు. ఈ దమనకాండను నిరసిస్తూ శుక్రవారం మెదక్ జిల్లా కేంద్రంలోని బస్‌డిపో సమీపంలో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం కలెక్టర్ రాహుల్‌రాజ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ.. కొన్ని నెలలుగా ఏపీలో సాక్షి పత్రికపై కక్ష గట్టి పత్రికా స్వేచ్ఛను హరిస్తూ రాజ్యాంగాన్ని కాలరాస్తుందన్నారు. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛను హరించడమంటే ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛను హరించినట్లేనని పేర్కొన్నారు. ఏపీలో సాక్షి టీవీ ప్రసారాలను ఆపటంపై సర్వోన్నత న్యాయస్థానం కూటమి ప్రభుత్వానికి చీవాట్లు పెట్టినా, సాక్షి ప్రధాన కార్యాలయంపై మూడు రోజులుగా దాడులు చేస్తూ సంపాదకుడికి నోటీసులు ఇవ్వటం, రాజ్యాంగ విరుద్ధమైనా ప్రశ్నలు సంధించటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికై నా దాడులు నిలిపివేసి, అకారణంగా పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకుటే యాజమాన్యాలకు అతీతంగా జర్నలిస్టుల సత్తా ఏమిటో చూపిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు నరేశ్‌గౌడ్, సాక్షి జిల్లా ఇన్‌చార్జి నీలయ్య, ఐ న్యూస్ బ్యూరో ఇన్‌చార్జి క్రాంతి, సీనియర్ పాత్రికేయులు నాగరాజు, గోపాల్‌గౌడ్, వెంకట్‌గౌడ్, సురేందర్‌రెడ్డి, మురళి, శ్రీనివాస్, లక్ష్మణ్, కృష్ణమూర్తి, మల్లేశం, ఊశయ్య, తదితరులు ఉన్నారు.
సాక్షిపై ఏపీ ప్రభుత్వం కుట్ర: మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి
చిన్నశంకరంపేట(మెదక్): పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించేల సాక్షి దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయ రెడ్డిపై టీడీపీ కూటమి ప్రభుత్వం అక్రమ కేసులను పెట్టడం సరికాదని మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి ఖండించారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కుట్రపూరితమైన చర్యలకు పాల్పడటం అప్రజాస్వామికమని పేర్కొన్నారు.
‘సాక్షి’పై ఏపీ సర్కార్ దాడులు హేయం
కేసులను వెంటనే
ఉపసంహరించుకోవాలి
జర్నలిస్టుల డిమాండ్
మెదక్‌లో ధర్నా, కలెక్టర్‌కు వినతి

పత్రికా స్వేచ్ఛను హరించడమే..

పత్రికా స్వేచ్ఛను హరించడమే..