
విద్యాసామర్థ్యాలు పెంచండి
హవేళిఘణాపూర్(మెదక్): ప్రభుత్వ పాఠశాలలో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమర్సీ (ఎఫ్‌ఎల్‌ఎన్) అమలులో ఆయా మండలాల ఎంఈఓలు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులదే కీలక బాధ్యత అని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. హవేళిఘణాపూర్ డైట్ కళాశాలలో శుక్రవారం ఎఫ్‌ఎల్‌ఎన్ అమలులో భాగంగా ఆయా మండలాల ఎంఈఓలు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎఫ్‌ఎల్‌ఎన్ పట్టిషంగా అమలు చేసి విద్యార్థులు విద్యాసామర్థ్యాలు సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలు పెంచి గుణాత్మక విద్యా బోధన ద్వారా భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు. నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన గుణాత్మక అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకిషన్, అసిస్టెంట్ మానిటరింగ్ అధికారి సుదర్శన్‌మూర్తి, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులు పాల్గొన్నారు.
పోషణ లోపం పిల్లలను గుర్తించాలి
మెదక్ కలెక్టరేట్: చిన్నారులు వ్యాధుల బారిన పడకుండా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దే బాధ్యత డీడబ్ల్యుఓ సిబ్బందిపై ఉందని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. శుక్రవారం తన కార్యాలయంలో సీ్త్ర, శిశు సంక్షేమశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పుట్టిన బిడ్డ ఆరోగ్యంపై తల్లి, బిడ్డలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పోషణ లోపం ఉన్న చిన్నారులను గుర్తించి, వారిని పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. పిల్లల ఎత్తు, బరువును ఎప్పటికప్పుడు పరిశీలించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. గర్భిణిలు ఆరోగ్యవంతంగా ఉండేందుకు తగిన ఆహారం, పోషకాహారం గురించి విస్తృత ప్రచారం చేయాలన్నారు.
విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలి
ఎఫ్‌ఎల్‌ఎన్ పటిష్టంగా అమలు చేయాలి
ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులదే
బాధ్యత
కలెక్టర్ రాహుల్‌రాజ్