
తొమ్మిదేళ్లు.. అవస్థలు ఎన్నాళ్లు!
కోటి ఆశ లతో పదో వసంతంలోకి మెతుకుసీమ
Ððl$™èl$MýS$ïÜÐ]l$ ¯]l*™èl¯]l hÌêÏV> AÐ]l-™èlÇ…_ ™öÑ$Ã-§ólâ¶æ$Ï ç³NÇ¢ ^ólçÜ$-Mö° ç³§ø Ð]lçÜ…-™èl…-ÌZMìS Ayýl$-VýS$-ò³-sìæt…¨. Mö…§ýlÆý‡$ ´ëÌS¯]l ^ólÆý‡$-OÐðl…§ýl° B¯]l…-§ýl-ç³-yýl$™èl$…sôæ.. ç³Ë$-Ð]l#Æý‡$ Cº¾…-§ýl$Ë$ ™èlç³µyýl… Ìôæ§ýl° BÐól-§ýl¯]l Ð]lÅMýS¢… ^ólçÜ$¢-¯é²Æý‡$. Mö™èl¢ hÌêÏ HÆ>µ-r$MýS$ Ð]l¬…§ýl$ ´ëÌS-¯]l…™é çÜ…V>-Æð‡yìlz MóS…{§ýl…-V>¯ól ÝëW…-¨. §ýl*Æ>-¿ê-Æý‡…™ø {ç³fË$ A¯ólMýS AÐ]lçܦË$ ç³yézÆý‡$. hÌêÏÌS ç³#¯]l-Ç-Ó-¿ýæ-f-¯]l™ø D {´ë…™èl {ç³fÌS _Æý‡-M>ÌS MøÇMýS ¯ðlÆý‡-ÐólÇ…¨. 11 AMøtºÆŠæḥ 2016ÌZ ™ðlÌS…-V>׿ _{™èl-ç³r…Oò³ Ððl$§ýlMŠS {ç³™ólÅMýS hÌêÏV> AÐ]l-™èlÇ…_…-¨.
– మెదక్‌జోన్
ఉమ్మడి జిల్లా నుంచి విడిపోయిన తర్వాత మెదక్ కొంతమేర అభివృద్ధి వైపు పయనిస్తోంది. 2022లో జిల్లాకు రైలు రావటంతో ఇక్కడి ప్రజల చిరకాల కోరిక తీరింది. 2023లో కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, జిల్లా పరిషత్, మాతా శిశు ఆస్పత్రి (ఎంసీహెచ్) భవనాలు అందుబాటులోకి వచ్చాయి. అత్యవసర వైద్యం అందించే (క్రిటికల్ కేర్) యూనిట్ మాత్రం నిర్మాణంలో ఉంది. అలాగే మెడికల్, నర్సింగ్ కళాశాలలు మంజూరు కాగా, ఓ ప్రైవేట్ భవనంలో తరగతులు కొనసాగుతున్నాయి. భవనాల నిర్మాణం కోసం రూ. 180 కోట్లు మంజూరయ్యాయి. స్థల సేకరణ పూర్తి అయినప్పటికీ టెండర్ దశలో ఉన్నాయి. జిల్లాకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూ రైంది. రామాయంపేటలో స్థల సేకరణ సైతం పూర్తి అయింది. అలాగే చేగుంట రైల్వేగేట్ సమీపంలో ఆర్వోబీ నిర్మాణం కోసం కేంద్ర ప్రభు త్వం రూ. 47 కోట్లు మంజూరు చేసింది. ఇటీవలే టెండర్ ప్రక్రియ పూర్తి కాగా, పనులు ప్రారంభించారు.
ఆశించిన ప్రగతి కరువు
మెదక్‌కు రింగ్‌రోడ్డు లేకపోవటంతో ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు. జిల్లాలో చూడదగిన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సీఎస్‌ఐ చర్చి, ఖిల్లా, పోచారం అభయారణ్యం, కామారెడ్డి– మెదక్ జిల్లాల సరిహద్దులోని పోచారం ప్రాజెక్టు, ఏడుపాయల దేవస్థానం, కొల్చారంలో నిర్మించిన జైన మందిరం గత చరిత్రకు అద్దం పడుతున్నాయి. వీటిని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని ఏళ్లుగా పాలకులు హామీలు ఇస్తున్నా, ఆచరణలో ముందుకు సాగటం లేదు. జిల్లాలో ఉన్నత విద్య సైతం అందని ద్రాక్షగానే మిగిలింది. పీజీ, ఇంజనీరింగ్, కేంద్రీయ విద్యాలయాలు కరువయ్యాయి. ఉన్నత చదువులకు విద్యార్థులు హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సి వస్తోంది. జిల్లాలో చెప్పుకోదగ్గ సాగునీటి ప్రాజెక్టులు లేవు. ఏకై క మధ్యతరహా ప్రాజెక్టు ఘనపూర్ రైతుల కల్పతరువు. దీని ఆయకట్టు ప్రస్తుతం 25 వేల ఎకరాలు మాత్రమే ఉంది. ఆనకట్ట ఎత్తు పెంచితే మరో 10 నుంచి 15 వేల ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశం ఉంది. దీని ఎత్తు పెంపు కోసం గతంలో నిధులు మంజూరు కాగా, నేటికీ ముంపునకు గురయ్యే భూములకు పరిహారం ఇవ్వలేదు. ఎత్తు పెంపు పనులు ముందుకు సాగటం లేదు. అలాగే కొన్ని మండలాల్లో కాళేశ్వరం కాలువల నిర్మాణం పూర్తి కాలేదు.
మధ్యలో నిలిచిన పనులు
జిల్లా కేంద్రంలోని పిట్లం చెరువు, గోసముద్రం చెరువులను మినీట్యాంక్ బండ్‌గా మార్చేందుకు 8 ఏళ్ల క్రితం రూ. 9 కోట్లు మంజూరయ్యాయి. ఇరిగేషన్ పరిధి పనులు పూర్తి అయినప్పటికీ, టూరిజం కింద చేపట్టిన పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. అలాగే పట్టణంలోని రాందాస్ చౌరస్తా, హెడ్ పోస్టాఫీస్, బోధన్ చౌరస్తాలు ఎలాంటి ప్రగతికి నోచుకోలేదు. మహానీయుల విగ్రహాలను నేటికీ పునరుద్ధరించలేదు.
కరువైన రింగురోడ్డు..
కష్టతరంగా ప్రయాణం
ఊసే లేని పర్యాటకం..
రైలుకూత, మెడికల్ కళాశాల,
ఇంటిగ్రేటెడ్ స్కూల్ తలమానికం